ETV Bharat / sitara

'కొన్ని విషయాలు గుర్తుకొస్తే సంతోషం కంటే బాధే ఎక్కువ' - salman khan Aiswarya rai love

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్​లు ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఓసారి ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు సల్మాన్ తల గొడకేసి బద్దలు కొట్టుకున్నాడని చెప్పుకున్నారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ స్పందించాడు.

సల్మాన్
సల్మాన్
author img

By

Published : May 15, 2020, 3:49 PM IST

Updated : May 15, 2020, 5:21 PM IST

బాలీవుడ్‌ చిత్రసీమలో ఎన్నో ప్రేమకథలు, మరెన్నో సంఘటనలు, బాధలు, అనుభవాలు కోకొల్లలుగా ఉంటాయి. ఏ హీరో-హీరోయిన్లను తీసుకున్న వారి జీవితంలో ఎప్పుడో ఒకసారి బాధపడి ఉంటారు. అలాంటి ఘటననే సల్మాన్‌ ఖాన్‌ జీవితంలోను జరిగింది.

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్‌ - సల్మాన్‌ ఖాన్‌ కలిసి 'హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌'లో నటించారు. సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాణదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. అప్పుడే ‌ వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఓ సారి ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు తన తలను గోడకేసి బద్దలు కొట్టుకున్నాడని బాలీవుడ్ వర్గాల్లో వినిపించింది. అప్పట్లో ఇరువురి మధ్య కొంత మనస్పర్థలు కూడా వచ్చాయని అప్పట్లో సినీ వర్గాలు చెప్పుకున్నాయి. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో సల్మాన్‌ స్పందించాడు.

"కొన్నిసార్లు మా ఇద్దరి మధ్య సరైన అవగాహన లేనప్పుడు, నేనే ఎంతో బాధపడ్డాను తప్ప.. వేరెవ్వరిని నొప్పించలేదు. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకున్నప్పుడు సంతోషం కంటే బాధపెట్టిన సంగతులే బాగా గుర్తుంటాయి" అని చెప్పాడు సల్మాన్.

Last Updated : May 15, 2020, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.