సెక్యురిటీ విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అడుగు బయటపెట్టాలంటే బాడీగార్డులు వారి వెంట ఉండాల్సిందే. తమకు రక్షణ కల్పించే సదరు బాడీగార్డ్‌లకు జీతాలు కూడా ఆ స్థాయిలోనే ఇస్తుంటారు. టీమ్ఇండియా కెప్టెన్, హీరోయిన్ అనుష్క శర్మ కూడా తన అంగరక్షకుడికి భారీ మొత్తంలో శాలరీ ఇస్తుంది. అది టాప్ కంపెనీల్లో సీఈఓలకు ఇచ్చే జీతాల కంటే ఎక్కువ కావడం విశేషం.
ప్రకాశ్ సింగ్ ఉరఫ్ సోనూ.. కొన్నేళ్ల నుంచి అనుష్క శర్మకు బాడీగార్డ్‌గా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే స్టార్ క్రికెటర్ కోహ్లీని పెళ్లి చేసుకోకముందు నుంచే ఆమెకు రక్షణగా వెన్నంటే ఉంటూ వస్తున్నాడు.
ఓ ప్రముఖ వెబ్సైట్ అంచనా ప్రకారం సోనూకు ఏడాది రూ.కోటీ 20 లక్షలు ఇస్తోందట అనుష్క. ఇది నిజమైతే చాలా కంపెనీల్లో సీఈఓలకు ఇచ్చే జీతం కంటే ఇది చాలా ఎక్కువే.
సోనూను కేవలం బాడీగార్డ్లానే కాకుండా ఓ కుటుంబ సభ్యుడిలా చూస్తుంటారు కోహ్లీ దంపతులు. అనుష్క శర్మ అయితే ప్రతి ఏడాది అతడి పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తుంది. 'జీరో' షూటింగ్లో ఉన్నప్పుడు కూడా అనుష్క.. సోనూ బర్త్‌డే జరిపి, కేక్ కట్ చేయించింది.
కేవలం అనుష్కకే కాకుండా కోహ్లీకి కూడా బాడీగార్డ్‌గా వ్యవహరిస్తుంటాడు సోనూ. విరాట్‌కు బాడీగార్డులు ఉన్నప్పటికీ, ఇతడికున్న ప్రాధాన్యం వేరు. అలానే అనుష్క గర్భవతిగా ఉన్న సమయంలోనూ పీపీఈ కిట్ ధరించి పనిచేశాడు సోనూ.
ఇవీ చదవండి: