Prabhas upcoming movies: వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న నటుడు ప్రభాస్(Prabhas). ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నింటి బడ్జెట్ కలిపితే రూ.1000 కోట్లకు పైనే. ఇప్పటివరకూ కరోనా కారణంగా చిత్రీకరణలు ఆలస్యమవుతుండటం వల్ల ఆయా సినిమాల బడ్జెట్ కూడా పెరిగిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సలార్'. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తొలుత అనుకున్న దానికంటే 'సలార్' బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం రూ.200 కోట్లకు పైనే ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఇందులో అత్యధిక మొత్తం ప్రభాస్‌కే చెల్లించాల్సి ఉండగా, యాక్షన్ సన్నివేశాలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయనున్నారట. ఈ క్రమంలోనే 'సలార్' రెండు భాగాలుగా వస్తుందన్న వార్తలు కూడా వినిపించాయి. చిత్రబృందం ఈ విషయాన్ని ఖండించింది. అలాంటిదేమీ లేదని చెప్పింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తేనే ఆ బడ్జెట్‌కు వర్కవుట్ అవుతుందని కొందరు సలహా ఇచ్చారట. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇవీ చదవండి: