ETV Bharat / sitara

అణు శాస్త్రవేత్త బయోపిక్​లో సైఫ్​! - బాలీవుడ్​ అణు శాస్త్రవేత్త హోమీ బాబా

అణు భౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్​ బాబా బయోపిక్​లో బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీఖాన్​ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు విక్రమ్​జిత్​ సింగ్​ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.

Saif Ali Khan To Star As Homi Jehangir Bhabha In Upcoming Biopic
అణు భౌతిక శాస్త్రవేత్త బయోపిక్​లో సైఫ్​!
author img

By

Published : May 2, 2021, 10:38 AM IST

కెరీర్‌లో విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ అలరిస్తున్న బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌.. మల్టీస్టారర్‌ సినిమాలతోనూ తనదైన ముద్రవేశారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ ప్రధానపాత్రలో నటిస్తున్న 'ఆదిపురుష్‌'లో రావణ్‌ పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కృతిససన్‌ కథానాయిక. సైఫ్‌ త్వరలో అణు భౌతిక శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబాగా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రానికి విక్రమ్‌జిత్ సింగ్‌ దర్శకత్వం వహించనున్నారట. 'రాయ్‌', 'నేచర్‌' వంటి చిత్రాలకు విక్రమ్‌ డైరెక్టర్​గా పనిచేశారు. న్యూక్లియర్‌ సైంటిస్ట్‌ హోమి బాబా జీవితాధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితం కానున్నట్లు తెలుస్తోంది.

Saif Ali Khan To Star As Homi Jehangir Bhabha In Upcoming Biopic
హోమీ జహంగీర్​ బాబా, సైఫ్​ అలీఖాన్​

ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ జరుగుతోందని సమాచారం. నాటి అణు శాస్త్రవేత్త హోబీ బాబాకు సంబంధించిన చిత్ర షూటింగ్‌ను ఇండియాతో పాటు లెబనాన్‌లోని బీరట్‌లోనూ చిత్రీకరణ చేయనున్నారట.

సైఫ్‌ 2020లో 'జవానీ జానేమన్' చిత్రంలో ఉమనైజర్‌ పాత్రలో కనిపించి సందడి చేశారు. ప్రస్తుతం ఆయన 'బంటీ ఔర్‌ బబ్లీ 2', 'భూత్‌ పోలీస్‌' సినిమాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: సినిమాహాల్​లో కట్‌.. యూట్యూబ్‌లో హిట్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.