డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా 'ఆదిపురుష్'. భారతీయ ఇతిహాస కథతో దీనిని రూపొందించనున్నారు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఫస్ట్‌లుక్‌తో పాటు ప్రకటన వచ్చిన వెంటనే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్త ఆసక్తి రేపింది. అతడు సైఫ్ అలీఖాన్ అని టాక్.
చెడుపై మంచిదే విజయం అనే కథతో దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో ప్రభాస్‌కు ధీటుగా ప్రతినాయకుడి పాత్ర ఉండనుందట. దానికోసమే సైఫ్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఈ నటుడు ఓం రౌత్ చివరి సినిమా 'తాన్హాజీ'లో కీలక పాత్రలో కనిపించాడు. అందుకే ఈ ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నాయి.
ఈ సినిమాను నేరుగా తెలుగు, హిందీలో తెరకెక్కించి ఆపై తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్ చేయనున్నారు. భూషణ్ కుమార్ సమర్పణలో గుల్షన్ కుమార్, టీ-సిరీస్ పతాకంపై కిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.