'దబాంగ్'తో హిట్ అందుకున్న సల్మాన్.. సీక్వెల్‌గా 'దబాంగ్-2' తెరకెక్కించాడు. ఈ విజయంతో మరోసారి 'దబాంగ్-3'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో మహేశ్ మంజ్రేకర్ చిన్న కుమార్తె సాయి.. సల్మాన్ సరసన కనిపించనుంది. సోనాక్షి సిన్హా.. రజ్జో పాండేగా నటిస్తోంది.
'దబాంగ్-3'లో హీరోయిన్గా మహేశ్ పెద్దకూతురు అశ్విని మంజ్రేకర్‌ను అనుకున్నారు. అశ్విని అంగీకరించకపోగా సాయిని సంప్రదించారట. మహేశ్-సల్మాన్ మంచి మిత్రులు కావడం ఇందుకు కారణం.
'దబాంగ్' చిత్రానికి అభినవ్ కశ్యప్, 'దబాంగ్-2'కి అర్బాజ్ ఖాన్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం 'దబాంగ్-3' ప్రభుదేవా దర్శకత్వంలో రానుంది.
ఇంతకుముందు సల్మాన్‌ఖాన్ హీరోగా ‘'పోకిరి'’ని హిందీలో ‘'వాంటెడ్'’గా తెరకెక్కించాడు ప్రభుదేవా. ఈ సినిమా భారీ విజయం సాధించింది.
ఇది చదవండి: ఓడిపోయినా బెట్టింగ్ డబ్బు తిరిగొచ్చింది!