ETV Bharat / sitara

'ఈ సారి కొత్త జోనర్​తో మీ ముందుకొస్తున్నా' - సాయి ధరమ్​ తేజ్​ లేటెస్ట్​ న్యూస్​

మెగా హీరో సాయి తేజ్​.. తన కొత్త సినిమాకు సంబంధించిన అప్​డేట్​ను తాజాగా వెల్లడించాడు. మిస్టరీ థ్రిల్లర్​ కథాంశంతో తన తర్వాతి చిత్రం రూపొందనుందని ట్విట్టర్​ వేదికగా తెలిపాడు. దానికి సంబంధించిన కాన్సెప్ట్​ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

Sai tej Trying a new genre mystical thriller
'ఈ సారి కొత్త జోనర్​తో మీ ముందుకొస్తున్నా'
author img

By

Published : Aug 14, 2020, 3:10 PM IST

ఎప్పటికప్పుడు విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు సాయి తేజ్‌. వరుస అపజయాల తర్వాత గతేడాది 'చిత్రలహరి', 'ప్రతి రోజూ పండగే' చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్‌' చిత్రీకరణ దశలో ఉంది.

తాజాగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు సాయి తేజ్‌. ఈ సారి మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. చక్రంలో నుంచి ఒంటి కన్నుతో ఓ వ్యక్తి చూస్తున్నట్లు విడుదల చేసిన పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

"సరికొత్త జోనర్‌లో సినిమాలు చేయడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అది కూడా నాకెంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్‌ గారితో కలిసి పనిచేయడం మరింత ప్రత్యేకం. #SDT15 మిస్టరీ థ్రిల్లర్‌ను ఎస్‌వీసీసీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు"

-సాయి ధరమ్‌ తేజ్‌, టాలీవుడ్​ కథానాయకుడు

ఈ చిత్రానికి సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక బృందం, టైటిల్‌ వంటి వివరాలను త్వరలోనే వెల్లడించనుంది చిత్రబృందం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.