ప్రేమించిన అమ్మాయి దూరం అయితే? గుండెకి గాయం చేసి వెళ్లిపోతే? దేవదాసులా మందు గ్లాసు పట్టాల్సిందే.. విరహగీతం పాడుకోవాల్సిందే. అమృత అనే అమ్మాయి వల్ల బాధ పడే ఓ యువకుడి గాధను పాట రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు రచయిత కాసర్ల శ్యామ్. 'సోలో బ్రతుకే సో బెటర్' కోసం ఆయన రాసిన 'అమృత' గీతం శ్రోతల్ని అలరిస్తోంది.
విడుదలైన కొద్ది క్షణాల్లోనే
ముఖ్యంగా ప్రేమలో విఫలమైన అబ్బాయిలకు ఆంథమ్ సాంగ్ అయిపోయిందీ పాట. విడుదలైన కొన్ని క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తోంది. సాయితేజ్, నభా నటేష్ జంటగా తెరకెక్కిన చిత్రమే 'సోలో బ్రతుకే సో బెటర్'. సుబ్బు దర్శకుడు.
చిరు చేతులతో
నేడు సాయి తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ గీతాన్ని అగ్ర కథానాయకుడు చిరంజీవి విడుదల చేశారు. "బల్బు కనిపెట్టినోడికే బతుకు చిమ్మ చీకటైపోయిందే" అంటూ ప్రారంభమయ్యే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
"చిన్న పిల్లవు కాదు చాక్లెట్ ఇచ్చేందుకు, ఫెవికాల్‌లా గట్టిగా ఫిక్స్ అయి చుక్కలు చూపిస్తావ్" అంటూ క్యాచీ పదాలతో నేటి పరిస్థితులకు తగ్గట్టు సాహిత్యం అందించి ప్రతి ఒక్కరూ పాడుకునేలా చేశారు రచయిత. బ్రేకప్ సాంగ్‌ని ఫాస్ట్‌బీట్‌తో సరికొత్తగా మలిచారు తమన్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:సాయితేజ్‌కు మెగాస్టార్ చిరు బర్త్‌డే గిఫ్ట్