ETV Bharat / sitara

అందుకే పేరు మార్చుకున్నా: సాయితేజ్

author img

By

Published : Dec 24, 2020, 7:28 AM IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, నభా నటేశ్​ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన తేజ్ పలు విషయాలు పంచుకున్నారు.

Sai Dharam Tej Interview About Solo Brathuke So Better
అందుకే పేరు మార్చుకున్నా: సాయితేజ్

పెళ్లి కాకముందు పేరెంట్స్‌.. పెళ్లాయ్యాక పెళ్లాం.. మన స్వేచ్ఛను లాగేసుకుంటారట. పెళ్లి విషయంలో ఎప్పటికైనా అమ్మలదే పైచేయి అంటూనే.. వాళ్లను ఎలాగూ ఆపలేం కాబట్టి.. అందుకే సింగిల్‌గా ఉన్నప్పుడే వీలైనంతగా జీవితాన్ని ఆస్వాదించాలంటూ జీవిత పాఠాలు బోధిస్తున్నాడు మెగా మేనల్లుడు సాయితేజ్‌. 'పిల్లా నువ్వులేని జీవితం' అంటూ పిల్ల కోసం వెంపర్లాడే కుర్రాడి నుంచి అసలు పెళ్లే వద్దు బాబోయ్‌ 'సోలో బ్రతుకే సో బెటర్‌' అనే వరకూ వచ్చాడీ 'సుప్రీమ్‌' హీరో. సుబ్బు దర్శకత్వంలో నభానటేశ్‌తో కలిసి సాయితేజ్‌ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్‌' డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సాయితేజ్‌ మీడియాతో ముచ్చటించారు. సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Sai Dharam Tej Interview About Solo Brathuke So Better
సోలో బ్రతుకే సో బెటర్

కొంతమంది తెలివైనోళ్లు.. మిగతావాళ్లంతా పెళ్లయినోళ్లు

పెళ్లి మంచిదా చెడ్డదా అనే విషయం చెప్పాలంటే.. మొదట సినిమా కాన్సెప్టు గురించి మాట్లాడాలి. కొంతవరకూ మన స్వేచ్ఛ మన తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. మనం ఏం చేయాలి? ఏం చదువుకోవాలి? అంతా వాళ్లే చూసుకుంటారు. పెళ్లయిన తర్వాత మన స్వేచ్ఛ మన భాగస్వామి చేతిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పిల్లలు.. వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇలా మన స్వేచ్ఛ ఎప్పుడూ మన చేతిలో ఉండదు. ఈ సినిమా కాన్సెప్టు ఏంటంటే మన స్వేచ్ఛ.. మన సంతోషం మన చేతిలోనే ఉండాలి. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సింగిల్‌గా ఉన్నప్పుడే జీవితాన్ని ఆస్వాదించాలి. సినిమాలో హీరో సిద్ధాంతం కూడా అదే. ఈ క్రమంలో తనకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? వాటిని అతడు ఎలా దాటుకుంటూ వస్తాడనేదే సినిమా. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాలోని ఓ శ్లోకం చెప్పాలి.. "కొంతమంది తెలివైనోళ్లు.. మిగతావాళ్లంతా పెళ్లయినోళ్లు" (నవ్వుతూ).

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పెళ్లి విషయంలో అమ్మను ఓడించలేం..

పెళ్లి విషయంలో (చేసుకోవద్దని) మనమెంత పట్టుదలతో ఉన్నా.. మనకంటే ఎక్కువ పట్టుదలతో మన అమ్మలుంటారు. చివరికి ఎలాగైనా వాళ్లే గెలుస్తారు. మనం వద్దూవద్దూ అన్నా వాళ్లే గెలుస్తారు. అది ఎలాగూ మనం ఒప్పుకోవాల్సిన విషయమే. "అమ్మా.. ఇంకొక సంవత్సరం" అంటూ దాన్ని వాయిదా వేయవచ్చు. అలా పెంచుకుంటూ వెళ్లడం తప్పితే మన చేతుల్లో ఏమీ ఉండదు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఒక ఏడాదిన్నర పెంచాను. మళ్లీ అడిగితే ఏదో ఒక కారణం చెప్పి మళ్లీ వాయిదా వేయాలి.

ఇంకు వృథా ఎందుకని..!

మీరు నన్ను సాయిధరమ్‌ తేజ్‌ అని కూడా పిలవచ్చు. పోస్టర్‌లో ఇంకు వృథా చేయడం ఎందుకని అలా రాయించాం (నవ్వుతూ). స్కూల్‌ నుంచి నన్ను అందరూ.. సాయి, సాయితేజ్‌ అని పిలిచేవారు. సాయితేజ్‌ అయితే పలకడానికి సులభంగా ఉంటుందని పెట్టుకున్నానంతే. న్యూమరాలజీ వంటివి కూడా ఏం లేవు.

సాయితేజ్ ఫ్యామిలీ

ఆ విశ్వాసంతోనే థియేటర్లకు వస్తున్నాం..

అందరూ ఓటీటీకి వెళ్తున్నారు.. ఈ సమయంలో మేం మాత్రం థియేటర్‌లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యామంటే దానికి ప్రధాన కారణం.. సినిమా కంటెంట్‌. మాకు సినిమా మీద నమ్మకం ఉంది. అందుకే ఇంతగా ప్రమోట్ చేస్తున్నాం. మనం లాక్‌డౌన్‌లో క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలు బాగా చూశాం. కానీ అసలైన తెలుగు సినిమాను చూడలేకపోయాం. కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించే వీలున్న సినిమా ఇది. పెళ్లి వద్దు అనే కాన్సెప్టు మీద చాలా సినిమాలు వచ్చాయి. వాటితో పోలిస్తే చాలా విభిన్నమైన సినిమా అని చెప్పను. కానీ, ఎక్కువగా మానవ సంబంధాలు, విలువల మీద ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా నాది అని కాదు గానీ, ఇండస్ట్రీకి కూడా చాలా ముఖ్యం. దాని కోసం మేం చాలా కృషి చేస్తున్నాం. అయినా థియేటర్‌లో చూస్తే ఆ కిక్కేవేరు. నిజానికి ఈ సినిమా మే 1న విడుదల చేయాల్సి ఉంది. కానీ, కరోనా వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. గత వారం వరకూ థియేటర్లు తెరుస్తారో లేదో అన్న అయోమయంలోనే ఉన్నాం. మంచి సినిమాతో వస్తున్నాం.. అభిమానుల దీవెనలు ఎప్పుడూ మనతోనే ఉంటాయనే నమ్మకంతో థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మా ముగ్గురు మావయ్యలకు ప్రత్యేకంగా ఓ షో వేయిస్తాం.

నా రియల్‌ లైఫ్‌కు సంబంధించిన కథలే వస్తున్నాయ్‌

ఈ సినిమా నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే చాలా కనెక్ట్‌ అయ్యా. 'చిత్ర లహరి' నుంచి నాకు వ్యక్తిగతంగా నన్ను పోలి ఉండే కథలే వస్తున్నాయి. 'చిత్ర లహరి'లో సక్సెస్‌ కోసం కష్టపడే ఓ కుర్రాడు.. పెద్దవాళ్లను ఎంత బాగా చూసుకోవాలో చూపించే 'ప్రతి రోజూ పండగే'. ఇదేమో యువతను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. పెళ్లిపై యువత అభిప్రాయం.. అదే సమయంలో పిల్లలకు పెళ్లిల్లు చేయాలని ఆలోచించే తల్లిదండ్రులు.. ఈ రెండు కోణాలు తీసుకొని సినిమా తీశాం. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అన్నీ ఉంటాయి. గతేడాది జూన్‌లో సుబ్బు కథ చెప్పాడు. అప్పుడు 'ప్రతి రోజూ పండగే' షూటింగ్‌ జరుగుతోంది. ఆ షూటింగ్‌ తర్వాత ఈ సినిమా మొదలుపెట్టాం.

ప్రజారోగ్యం కంటే కలెక్షన్లు ముఖ్యం కాదు

50 శాతం నిబంధన మనం పాటించాల్సిందే. ప్రస్తుతానికి మనం సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యం. ప్రజల రక్షణ కంటే ముఖ్యమైందేం లేదు. టికెట్లు చాలా అమ్ముడయ్యాయి. నిర్మాతలు ప్రస్తుతం సేఫ్‌గానే ఉన్నారు. వాటన్నింటి కంటే జనాలు సామాజిక దూరం పాటిస్తూ.. థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తే అంతకన్నా ఆనందం ఏముంది? అదే అన్నింటి కంటే మాకు ముఖ్యం. ఈ సినిమాతో మా మీద బాధ్యత మరింత పెరిగింది. అందుకే సినిమాను జనంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం.

వాడెప్పుడు నాకు పోటీ కాదు

లాక్‌డౌన్‌లో వాటర్‌బాటిల్స్‌ నింపాను. అందులో ఎంత కష్టముందో ఇప్పుడే తెలిసింది. రాత్రిపూట బాటిళ్లన్నీ నింపితే.. పొద్దునకల్లా మొత్తం ఖాళీ అయ్యేవి. నీళ్లను కాచి వడపోయాలి.. తర్వాత బాటిళ్లలో నింపాలి.. వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. వంట తప్పించి ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులన్నీ చేశా. పుస్తకాలు చదివా.. వెబ్‌సిరీస్‌లు చూశా. స్కామ్‌ 1992 బాగా నచ్చింది. బొమ్మలతో కూడా ఆడుకుంటాను. వైష్ణవ్‌తేజ్ విషయానికి వస్తే.. వాడు నాకెప్పుడూ పోటీ కాదు. చెట్టుకెన్నో పువ్వులు పూస్తాయి. దేనికదే ప్రత్యేకం. నిజానికి మా ఇంట్లో మేం సినిమాల గురించి అసలే ప్రస్తవించం. ఇంట్లో చాలా స్నేహపూర్వకంగా ఉంటాం.

ఏడాదికి రెండు సినిమాలనే మాటే ఎంతో బాగుంది..

2021లో రెండు సినిమాలు చేస్తానని ఒప్పేసుకున్నాను. ప్రస్తుతానికి ఆ రెండు సినిమాలు నా చేతిలో ఉన్నాయి. వచ్చే ఏడాది రెండు సినిమాలు విడుదల చేస్తున్నాననే మాటే ఎంతో బాగుంది. దేవకట్ట గారితో నేనో సినిమా చేస్తున్నా. అది ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఔట్‌డోర్‌ సన్నివేశాలు షూట్‌ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఏలూరులో షూటింగ్‌ చేస్తున్నాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.