తాప్సీ, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రధారులగా నటిస్తున్న చిత్రం సాండ్ కీ ఆంఖ్. ఈ సినిమా తొలిరూపు విడుదలైంది. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
"శరీరానికి ముసలితనం వచ్చినా... మనసుకు రాలేదు" అనే మాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్లో తాప్సీ, భూమి 60 ఏళ్ల పైబడిన మహిళల పాత్రల్లో కనిపిస్తూ.. ఆశ్చర్యపరుస్తున్నారు.
ప్రపంచంలోనే వయోధిక షూటర్లుగా పేరుగాంచిన చాంద్రోతోమర్, ప్రకాశీ తోమర్ జీవితాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరూ షూటింగ్లో 700పైగా జాతీయ పతకాలు గెల్చుకున్నారు. చాంద్రోగా తాప్సీ నటిస్తుండగా, ప్రకాశీ పాత్రను భూమి పోషిస్తోంది.
ఈ సినిమాకు తుషార్ హిరాందాని దర్శకుడు. అనురాగ్ కశ్యప్, నిధి పామర్ నిర్మాతలు.