బైక్‌పై ప్రభాస్.. అభిమానులకు సర్ప్రైజ్ - శ్రద్ధ కపూర్
సాహో సినిమాలోని ప్రభాస్ మరో లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సాహో... ప్రభాస్ నటిస్తున్న చిత్రం. షూటింగ్ మొదలైనప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలే చిత్రబృందం విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్‌లుక్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. హీరో ప్రభాస్ బైక్‌పై వెళ్తున్న మరో లుక్‌ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ముందుగా సమాచారం ఇవ్వకుండా వారిని సర్ప్రైజ్ చేసింది.
ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోందీ చిత్రం. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా అభిమానుల్ని అలరించనుంది. యూవీ క్రియేషన్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. శంకర్-ఎహసన్-లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: సాహో పోస్టర్ విడుదల.. స్టైలిష్ లుక్‌లో ప్రభాస్
Patna (Bihar), May 27 (ANI): A man shot dead by unknown assailants in Bihar's Patna on Monday. The incident happened in Kidwaipuri area. The body has been sent for postmortem. Local police is reached to the spot. Further investigation is underway.