ఆగస్టు 15.. స్వాతంత్ర్య దినోత్సవం.. ఈ రోజున సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ఏడాదీ పోటీ బాగానే ఉంది. కారణం ఆ రోజు గురువారం.. రాఖీ పౌర్ణమి కావడం. తర్వాత శుక్ర, శని, ఆది వీకెండ్ ఉన్నందువల్ల ప్రేక్షకులు భారీగా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా..? ఈ ఏడాది ఆగస్టు 15న బాలీవుడ్లో ఏకంగా మూడు భారీ చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
సాహో
టాలీవుడ్‌తో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ చిత్రం' సాహో'. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన మూవీ అవడం వల్ల ప్రేక్షకులు సినిమా రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మిషన్ మంగళ్
అక్షయ్ కుమార్, విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, కృతి కుల్హారీ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'మిషన్ మంగళ్'. మార్స్ గ్రహంపైకి భారత అంతరిక్ష కేంద్రం పంపిన 'మంగళయాన్' ప్రాజెక్టును ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. జగన్ శక్తి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
బాట్లా హౌస్
2008 సెప్టెంబర్ 19న దిల్లీలో జరిగిన ఎన్కౌంటర్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'బాట్లా హౌస్'. జాన్ అబ్రహం హీరో. నిఖిల్ అడ్వాణీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. బాలీవుడ్లో 'సాహో'ను నిర్మిస్తోన్న టీ సిరీస్ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.
ఈ మూడు చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో పోటీ పడనున్నాయి. మరి ఈ త్రిముఖ పోటీలో ప్రేక్షకులు ఏ మూవీకి ఓటు వేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.
ఇవీ చూడండి.. 'అచ్చం కపిల్‌దేవ్ లాగే ఉన్నాడుగా'