ప్రభాస్ నటించిన 'సాహో' వసూళ్ల సునామీ ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించట్లేదు. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకెళ్తోన్న సినిమా... ఈ వారంతానికి రూ. 400 కోట్ల మార్కును అందుకునేలా ఉంది. ఒక్క హిందీలోనే రూ. 102 కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది.
ఆగస్టు 30న విడుదలైన సాహో సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్నప్పటికీ ఆ ప్రభావం కలెక్షన్లపై పెద్దగా కనిపిచట్లేదు. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనత సాధించింది.
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు. నీల్ నితిన్ ముఖేశ్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ - ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: రామోజీ ఫిల్మ్‌సిటీలో బాలయ్య సందడి