ఈ ఏడాది భారీ బడ్జెట్‌తో విడుదలవుతోన్న చిత్రాల్లో 'సాహో' ఒకటి. ఈ సినిమా కోసం దాదాపు రూ.350 కోట్లు ఖర్చుపెట్టారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే, ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు. విడుదలకు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.125 కోట్లు వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతంలో జక్కన్న తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా రూ. 130 కోట్లు సాధించింది. సాహో మాత్రం రూ. 256 కోట్లు సాధించొచ్చని నిర్మాతలు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ | రూ. 115 కోట్లు |
ఓవర్సీస్ | 46 కోట్లు |
కర్ణాటక | 24 కోట్లు |
బాలీవుడ్ | 50 కోట్లు |
తమిళనాడు, కేరళ | 21కోట్లు |
ప్రపంచవ్యాప్తంగా | 256 కోట్లు |
ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. శ్రద్ధా కపూర్ కథానాయిక. ఆగస్టు 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.