ETV Bharat / sitara

'సాహో' దర్శకుడితో రామ్ ​చరణ్..!​ - దర్శకుడు సుజీత్​, రామ్​చరణ్ సినిమా

సుజీత్​.. కేవలం రెండు చిత్రాలను తెరకెక్కించి అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్న దర్శకుడు. 'సాహో' సినిమాకు దర్శకత్వం వహించిన సుజీత్​ మరో కొత్త మూవీకి ఇప్పటివరకు గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వలేదు. తాజాగా ఈ యువ డైరెక్టర్.. మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​తో ఓ సినిమా తీయనున్నట్లు వార్తలొస్తున్నాయి.

Saaho director Sujeeth to team up with Ram Charan for his next?
'సాహో' దర్శకుడితో రామ్​చరణ్​
author img

By

Published : Jan 30, 2020, 11:51 AM IST

Updated : Feb 28, 2020, 12:23 PM IST

ప్రభాస్‌ హీరోగా నటించిన 'సాహో' చిత్రానికి సుజీత్​ దర్శకత్వం వహించాడు. అయితే అప్పటి నుంచి ఈ డైరెక్టర్ మరో కొత్త సినిమాకు ఓకే చెప్పలేదు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్‌తో కలిసి ఓ చిత్రం చేయనున్నాడని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే ఒకసారి చరణ్​-సుజీత్‌లు కలిసి దీనిపై చర్చించుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌.. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నాడు.

ఇదీ చదవండి: 'అది దృష్టిలో పెట్టుకునే అశ్వథ్థామ తీశా'

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2020, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.