ప్రముఖ బాలీవుడ్ నటి అమీషా పటేల్(ameesha patel movies) హాజరైన ఓ ఈవెంట్లో గందరగోళం చోటు చేసుకుంది. నిర్వాహకులు, హీరోయిన్‌కు సంబంధించిన వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. అమీషా(ameesha patel movies) అనుకున్న సమయం కంటే తక్కువ సమయంలోనే స్టేజ్‌పై నుంచి దిగడమే ఇందుకు కారణం.
ఏం జరిగింది?
రాజస్థాన్ కోటాలో ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరైంది బాలీవుడ్ నటి అమీషా పటేల్(ameesha patel movies). ఈ వేడుక నిర్వాహకులు ఆమె స్టేజ్‌పై గంటసేపు ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ అర్ధ గంట తర్వాత అమీషా(ameesha patel movies) స్టేజ్‌పై నుంచి దిగిపోయింది. అనంతరం ఆమె వెళ్లి కారులో కూర్చుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్గనైజర్స్. ఈ సమయంలోనే ఆర్గనైజర్స్కు అక్కడకు వచ్చిన వారి మధ్య గొడవ జరిగింది. దీంతో అక్కడి వాతావరణం గందరగోళంగా మారింది. పరిస్థితిని గమనించిన పోలీసులు అమీషాను అక్కడ నుంచి పంపేశారు.
హీరోయిన్‌పై నిర్వాహకుల ఫిర్యాదు
గందరగోళం అంతా ముగిసిన తర్వాత మహవీర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఈవెంట్ ఆర్గనైజర్స్ అమీషా పటేల్‌పై ఫిర్యాదు చేశారు. వేడుకలో అమీషా గంటసేపు ఉండటానికి ఒప్పందం కుదుర్చుకున్నామని.. కానీ ఆమె అర్ధ గంట తర్వాత వెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.