దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' కోసం సినీప్రియులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. కరోనా వల్ల వచ్చిన లాక్‌డౌన్‌తో చిత్రీకరణ వాయిదా పడింది. అనంతరం సడలింపుల్లో భాగంగా షూటింగ్ ప్రారంభమైన సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇప్పుడు దసరా పండగ తర్వాత తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం హైదరాబాద్ అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో సెట్ నిర్మించారట. ఈసారి విదేశీ నటులతో కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేశారని సమాచారం.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'బాహుబలి' విజయం తర్వాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడం వల్ల ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ఇదీ చూడండి వివాదస్పద 'ముంబయి' ట్వీట్‌పై కంగన వివరణ