ETV Bharat / sitara

5 రోజుల్లోనే రూ.600 కోట్ల వసూళ్లు.. ఆ ప్రాంతాల్లో 'ఆర్​ఆర్​ఆర్'​ సెంచరీల మోత - alia bhatt

RRR Worldwide Collection Day 5: విడుదలైన మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు (గ్రాస్) కొల్లగొట్టిన 'ఆర్​ఆర్​ఆర్​'.. ప్రపంచవ్యాప్తంగా ఐదోరోజుకే రూ.611 కోట్లు రాబట్టింది. ఈ మేరకు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక నైజాం సహా హిందీలో రూ.100 కోట్ల (గ్రాస్​) పైనే వసూలు చేసింది 'ఆర్​ఆర్​ఆర్'​.

rrr collection
rrr collection till now
author img

By

Published : Mar 30, 2022, 1:28 PM IST

RRR Worldwide Collection Day 5: రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'ఆర్​ఆర్​ఆర్​' కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. మార్చి 25న రిలీజైన ఈ సినిమా ఐదు రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్​ వసూళ్లు సాధించింది. కేవలం హిందీలోనే రూ.100 కోట్ల (గ్రాస్) మార్కును దాటగా నైజాంలోనూ సెంచరీ కొట్టింది. ట్రేడ్​ వర్గాల లెక్కల ప్రకారం.. మంగళవారం నాటికి 'ఆర్​ఆర్​ఆర్'​ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

నైజాం గులాం..: నైజాంలో ఐదు రోజుల్లోనే రూ.101.5 కోట్ల గ్రాస్ వసూళ్లు (రూ.68.30 కోట్ల షేర్) సాధించింది 'ఆర్ఆర్ఆర్'. ఆంధ్రలో రూ.97.3 కోట్ల గ్రాస్​ వసూళ్లు (రూ.97.17 కోట్ల షేర్) రాబట్టింది. సీడెడ్​లో రూ.44.3 కోట్లు (రూ.33.48 కోట్లు షేర్) కొల్లగొట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 242 కోట్ల గ్రాస్​ వసూళ్లు (రూ.168.95 కోట్ల షేర్) వచ్చేయి.

rrr collection
'ఆర్​ఆర్​ఆర్'​

తమిళనాడు, కర్ణాటకలో బాక్సాఫీస్ బద్దలు: తమిళనాడులో ఐదురోజులకు కలిపి రూ.41 కోట్ల గ్రాస్​ వసూళ్లను సాధించింది 'ఆర్​ఆర్​ఆర్​'. కేరళలో మూడు రోజుల్లోనే రూ.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక కర్ణాటకలో బాక్సాఫీస్​ను షేక్​ చేస్తోంది 'ఆర్​ఆర్​ఆర్'​. ఐదు రోజుల్లో రూ. 49.3 కోట్ల గ్రాస్​ (రూ.26.6 కోట్ల షేర్)​ సాధించింది.

RRR Box Office Collection in India: భారత్​లోనే రూ.500 కోట్లు!: ఇక దేశంలోని ఇతర ప్రాంతాల్లో రూ. 132.3 కోట్ల గ్రాస్​ వసూలు చేసింది 'ఆర్​ఆర్​ఆర్'. దీంతో ఐదు రోజుల్లో ఆల్​ఇండియాలో 'ఆర్​ఆర్​ఆర్'​ లెక్క రూ.500 కోట్లకు చేరువైంది. మంగళవారం నాటికి భారత్​లో రూ.475.5 కోట్లను (రూ.284.45 కోట్ల షేర్) రాబట్టింది.

rrr collection
చరణ్-తారక్

RRR Box Office Collection Worldwide: 'ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లు': ఐదు రోజులు పూర్తయ్యే సరికి అమెరికాలో రూ.78.5 కోట్ల గ్రాస్​ వసూళ్లను సాధించింది 'ఆర్​ఆర్​ఆర్​'. ఇతర దేశాల్లో దాదాపు రూ.57 కోట్ల గ్రాస్​ సాధించింది ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజులకే 'ఆర్​ఆర్​ఆర్​' రూ.611 కోట్ల పైచిలుకు వసూళ్లను (రూ.353.3 కోట్ల షేర్) సాధించినట్లు తెలుస్తోంది.

యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ నటించారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియా భట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించారు.

ఇవీ చూడండి:

'ఆర్​ఆర్​ఆర్'​​పై తారక్​ భావోద్వేగం.. మాటలు రావడం లేదంటూ..

Ram Gopal Varma on RRR: 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై వర్మ షాకింగ్ కామెంట్స్​

జక్కన్నపై ఆలియా అలక.. ఇన్​స్టాలో అన్​ఫాలో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.