ETV Bharat / sitara

ఎన్టీఆర్​ వీరాభిమాని.. 'ఆర్​ఆర్​ఆర్'​ కోసం థియేటర్​ బుక్​

RRR USA premiers: ఎన్టీఆర్​ వీరాభిమాని అంట.. ఏం చేశాడో తెలుసా?.. 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రీమియర్​ షోకోసం ఏకంగా థియేటర్​ మొత్తాన్నే బుక్​ చేశాడు. మొత్తం 75 టికెట్లు కొనుగోలు చేశాడు.

author img

By

Published : Mar 6, 2022, 9:40 PM IST

RRR
ఆర్​ఆర్​ఆర్

RRR USA premiers: మార్చి 25న 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు.. ప్రీమియర్​షో కోసం ఏకంగా థియేటర్​నే బుక్​చేశాడు. అమెరికా ఫ్లోరిడాలోని టెన్సిల్​ నగరంలోని థియోటర్​లో మొత్తం 75 టికెట్లను కొనుగోలు చేశాడు. ఈ టికెట్లను సామజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయగా వైరల్​గా మారింది.

ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్​ఆర్​'విడుదలకు ముందే పలు రికార్డులను అందుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలో అడ్వాన్స్​ బుకింగ్స్​ ఓపెన్​ చేసిన 10 గంటల్లోనే దాదాపు 5 లక్షల డాలర్లను(హాఫ్​ మిలియన్​) సంపాదించింది.

లండన్​లో ఒడియన్​ బీఎఫ్​ఐ ఐమాక్స్​లోనూ 'ఆర్​ఆర్​ఆర్​' ప్రదర్శనకానుంది. యూకేలోనే ఇది అతి పెద్ద ఐమ్యాక్స్​ థియేటర్​ అవ్వడం విశేషం. కాగా, ఈ తెరపై ప్రదర్శనకానున్న తొలి భారతీయ చిత్రం కూడా ఇదే.

యూకేలో దాదాపు 1000 స్క్రీన్లపై 'ఆర్​​ఆర్​ఆర్​'​ రిలీజ్​ కానున్నట్లు తెలిసింది. జనవరి 7నే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా మార్చి 25కు వాయిదా పడింది.

దాదాపు రూ.450కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మించిన ఈ మూవీలో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్​ దేవగణ్​, ఆలియా భట్​, శ్రియ కీలక పాత్రలో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ప్రభాస్ సెట్​లో ఉంటే ఫుల్ ఎంజాయ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.