RRR Trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. విడుదలమైన ఐదు భాషల్లో (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) భాషల్లో 15కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ మూవీ విడుదలకానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాత.
![RRR Trailer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14348951_1.jpg)
ఆలియా చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్..
ఆలియా భట్ హీరోయిన్గా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం 'గంగూబాయ్ కతియావాడి'. వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఫిబ్రవరి 25న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఫిబ్రవరి 4న చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.
![gangubai kathiawadi release date](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14348951_3.jpg)
కొత్త తేదీతో 'భూల్ భులయ్యా2'
కార్తిక్ ఆర్యన్, కియారా అడ్వాణీ జంటగా నటిస్తోన్న హారర్ కామెడీ చిత్రం 'భూల్ భులయ్యా 2' కొత్త విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఇదివరకు మార్చి 25 రిలీజ్ చేస్తామని ప్రకటించగా.. తాజాగా మే20న విడుదలకానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి అనీష్ బజ్మీ దర్శకుడు. భూషణ్ కుమార్ నిర్మాత. సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
![bhool bhulaiyaa 2 release date](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14348951_4.jpg)
బిగ్‌బీ చిత్రం రిలీజ్ డేట్..
అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో రానున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'ఝుండ్'. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన చిత్రాన్ని మార్చి 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. మరాఠి చిత్రం సైరాత్తో గుర్తింపు తెచ్చుకున్న నాగరాజ్ మంజులే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
![jhund release date](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14348951_5.jpg)
రవితేజ షూటింగ్ షురూ..
సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం 'రావణాసుర'. ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేశారు రవితేజ. ఈ మేరకు చిత్రబృందంతో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు.
![ravi teja ravanasura movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14348951_2.jpg)
మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజతోపాటు యువ కథానాయకుడు సుశాంత్ నటిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా, పూజిత, మేఘా ఆకాశ్, అను ఇమ్మన్యూయేల్, దక్షా నగర్కార్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.'
'సెహరి' ట్రైలర్
Sehari movie release date: రొమాంటిక్ ఎంటర్టైనర్ 'సెహరి' మూవీ ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఫిబ్రవరి 11నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో సిమ్రన్ చౌదరి హీరోయిన్గా నటించింది. జ్ఞానశేఖర్ ద్వారక దర్శకత్వం వహించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టీజర్‌తో విశ్వక్..
విశ్వక్సేన్ నటించిన విలేజ్ డ్రామా 'అశోకవనంలో అర్జున కల్యాణం'. ఈ సినిమా టీజర్ విడుదలై అలరిస్తోంది. ఇందులో రుక్సార్ థిల్లన్ హీరోయిన్గా నటించింది. రవికిరణ్ కోల కథ అందించగా, విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మార్చి 4న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: ప్రభాస్ 'రాధేశ్యామ్' కొత్త రిలీజ్ డేట్ ఖరారు