ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​.. తారక్-చరణ్ చూసినప్పుడు రియాక్షన్ ఇదే! - RRR rajamouli

RRR trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​ రిపీట్​గా చూస్తున్న అభిమానులు తెగ ఎగ్జైట్​ అవుతున్నారు. అలాంటిది ఆ సినిమా హీరోలు రామ్​చరణ్, ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అయ్యారంటే?

ram charan ntr
రామ్ చరణ్ ఎన్టీఆర్
author img

By

Published : Dec 12, 2021, 9:27 PM IST

RRR trailer reaction: డిసెంబరు 9న 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజైంది. అప్పటి నుంచి ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ. దీనితోపాటు గత కొన్నిరోజులుగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చిత్రబృందం కూడా బిజీ అయిపోయింది. అయితే తొలిసారి ట్రైలర్​ చూసిన మనమే ఇంతలా ఆశ్చర్యపోతే.. హీరోలు ఎలా రియాక్ట్ అయ్యుంటారు? దానికి సమాధానంగా ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విట్టర్​లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

Ram charan Ntr: ఇందులో భాగంగా డైరెక్టర్​ రాజమౌళిని ఎత్తుకుని తన సంతోషాన్ని తెలియజేశారు హీరో రామ్​చరణ్. పక్కనే ఉన్న ఎన్టీఆర్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఈ పాన్ ఇండియా సినిమాకు కీరవాణి సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్​లోని మ్యూజిక్​.. ఫ్యాన్స్​కు పూనకాలు తెప్పిస్తోంది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆత్రుతగా కలిగిస్తోంది.

రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.