Ramcharan Birthday celebrations: మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ దంపతులు సహా పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. 'నాటు నాటు' పాటకు 'ఆర్ఆర్ఆర్'లు కలిసి డ్యాన్స్‌లు వేస్తూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను తారక్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాసేపట్లోనే వైరల్‌గా మారిన ఈ వీడియోకు అభిమానులు విపరీతంగా లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో "తారక్ నిజంగా చాలా ఏళ్ల పాటు ధైర్యం చేసి తన భార్యను వదిలేసి నా దగ్గరకు వచ్చాడు" అంటూ చెర్రీ చెప్పిన సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అంతకుముందు 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ.."ప్రపంచానికి, సమాజానికి తెలియకుండా మేం మంచి స్నేహితులం. అది రాజమౌళికి ఒక్కడికే తెలుసు. మేము ఇద్దరం భిన్న ధ్రువాలం. భిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయనేది మా విషయంలో కూడా జరిగింది. మార్చి 26న ప్రణతి పుట్టినరోజు. మార్చి 27న చెర్రీ పుట్టినరోజు. వీరిద్దరి ఇళ్లు చాలా దగ్గరగా ఉంటాయి. రాత్రి 12 గంటలకు ప్రణితిని కలిసి టక్కున రామ్ దగ్గరకి వెళ్లిపోయేవాడిని. అతడు నన్ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేవాడు." అని అన్నారు. దీన్ని ఉద్దేశించే తాజాగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో చరణ్.. తారక్ గురించి పైవ్యాఖ్యలు చేశాడు.
కాగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇందులో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించగా అజయ్‌దేవగన్, ఆలియా భట్, శ్రియ కీలక పాత్రలు పోషించారు.
ఇదీ చూడండి: ఎన్టీఆర్ డబుల్ హ్యాట్రిక్ హిట్.. ఆమిర్-మోహన్‌లాల్ కలిసిన వేళ