తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్'లోని ఎన్టీఆర్ కొత్త లుక్ విడుదలైపోయింది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొమురం భీమ్ అవతార్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో బల్లెం చేతిలో పట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపించారు తారక్. ఇది అభిమానులను కట్టిపడేసేలా ఉంది. ఇక తెరపై ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడటమే ఆలస్యం. ఇప్పటికే విడుదలైన 'రామరాజు ఫర్ భీమ్' సినీప్రియులను ఎంతగానో అలరించింది.
"మా భీమ్‌ది బంగారులాంటి మనస్సు. కానీ, ఆయనే కనుక తిరుగుబాటు చేస్తే బలం, ధైర్యంగా నిలుస్తాడు'
-రాజమౌళి ట్వీట్.
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">