ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్' తమిళ హక్కులు దక్కించుకున్న లైకా - rrr rights

దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్' సినిమా తమిళనాడు థియేట్రికల్​ హక్కులను అక్కడి అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ సొంతం చేసుకుంది. దాదాపు రూ.45కోట్లకు దక్కించుకుందని సమాచారం.

rrr
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Feb 17, 2021, 4:43 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్​' ​సినిమా ప్రీ రిలీజ్​ బిజినెస్​ అంచనాలను మించేలా ఉంది. తాజాగా ఈ చిత్ర తమిళ థియేట్రికల్​ హక్కులను అక్కడి ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్, డీవీవీ ఎంటర్​టైన్​మెంట్​ సంస్థలు​ ట్వీట్​ చేశాయి. దాదాపు రూ.45కోట్లకు లైకా హక్కుల్ని దక్కించుకుందని సమాచారం.

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్, హీరోయిన్​ ఆలియా భట్​‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్' రిలీజ్​.. బీటౌన్​ నిర్మాత అసంతృప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.