భారీ బడ్జెట్ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'.. జనవరి 7న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ నిర్ణయంతో రామ్‌చరణ్, ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు చాలా నిరాశ చెందారు.
RRR promotions cost: అయితే పాన్ ఇండియా రేంజ్లో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ రాజమౌళితో పాటు రామ్‌చరణ్, ఎన్టీఆర్.. పలు రాష్ట్రాల్లో తిరుగుతూ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొని తెగ సందడి చేశారు. అలానే తెలుగు రాష్ట్రాల నుంచి చరణ్, తారక్ అభిమానుల్ని కూడా బస్సుల్లో ఆయా చోట్లకు తీసుకెళ్లారు.
వీటన్నింటికి కలిపి 'ఆర్ఆర్ఆర్' టీమ్ దాదాపు రూ.18-20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే 'ఆర్ఆర్ఆర్' కొత్త రిలీజ్ డేట్ సమయానికి మళ్లీ ఈ రేంజ్లో ప్రమోషన్స్‌కు ఖర్చు చేస్తారా? లేదా? అనేది చూడాలి.
RRR postponed: దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
- 'ఆర్ఆర్ఆర్' సినిమా మళ్లీ వాయిదా
- ''ఆర్ఆర్ఆర్'లో ఆ సీక్వెన్స్.. ప్రేక్షకులు ఊపిరి తీసుకోవడం మర్చిపోతారు'
- 'ఆర్ఆర్ఆర్'లో ఆ ఇద్దరివి గెస్ట్ రోల్స్: రాజమౌళి
- 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 65 రాత్రులు
- ఏ డైరెక్టర్‌కు నేను అలా చెప్పలేను: హీరో రామ్‌చరణ్
- 'రాజమౌళిని నమ్మి రూ.1000 కోట్లయినా పెట్టొచ్చు'
- 'ఆర్ఆర్ఆర్'లోని ప్రతి సీన్ మళ్లీ చేసేందుకు రెడీ: ఎన్టీఆర్
- రాజమౌళి డ్రీమ్‌ప్రాజెక్ట్ 'మహాభారతం'లో చరణ్-ఎన్టీఆర్