'ఆర్ఆర్ఆర్'లోని రామ్‌చరణ్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను అతడి పుట్టినరోజు(మార్చి 27) సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం శనివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో అభిమానులు, ఇప్పటి నుంచే పండగ చేసుకుంటున్నారు.
దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరు 13న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.