ETV Bharat / sitara

సూపర్​ హీరోగా 'ఆర్​ఆర్​ఆర్'​ నిర్మాత తనయుడి ఎంట్రీ..

author img

By

Published : Mar 23, 2022, 5:33 PM IST

RRR producer son debut film: తన తనయుడు కల్యాణ్​ దాసరిని హీరోగా లాంఛ్​ చేయాలని నిర్మాత దానయ్య చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. విభిన్న కథలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్​ వర్మ దర్శకత్వంలో అతడిని పరిచయం చేయనున్నారు. ఈ పాజ్రెక్ట్​ సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించారు.

RRR Producer Danayya son
RRR Producer Danayya son

RRR producer son debut film: చిత్రసీమలో ఇప్పటికే ఎంతో మంది వారసులు వచ్చారు. వారిలో కొంతమంది స్టార్స్​గా కూడా ఎదిగారు. ఇప్పుడు మరో సినీ వారసుడు వెండితెర అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. అతడే ప్రముఖ నిర్మాత దానయ్య తనయుడు కల్యాణ్​ దాసరి. తన అరంగేట్రాన్ని వినూత్నంగా ప్లాన్​ చేసుకున్నాడు. తన పరిచయ చిత్రం డిఫరెంట్​గా ఉండేలా ఓ ఇంట్రెస్టింగ్​ ప్రాజెక్ట్​ను ఎంచుకున్నాడు. 'అ', 'కల్కి', 'జాంబిరెడ్డి' వంటి వైవిధ్య కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్​ వర్మ దర్శకత్వంలో అతడు గ్రాండ్​గా సిల్వర్​స్క్రీన్ ఎంట్రీ​ ఇవ్వనున్నాడు. నేడు(బుధవారం) ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన వివరాలను ప్రకటించారు. 'అధీర' అనే టైటిల్​తో పాన్​ ఇండియా ఫిల్మ్​గా దీన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఇందులో కల్యాణ్​ అతీత శక్తులున్న సూపర్​హీరో పాత్ర చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ఓ స్పెషల్​ గ్లింప్స్​ను 'ఆర్​ఆర్​ఆర్'​ టీమ్​ దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్​, రామ్​చరణ్​ రిలీజ్​ చేశారు. ఇది సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ మూవీకి దానయ్య కాకుండా నిరంజన్​రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరోవైపు ప్రశాంత్​ వర్మ.. ఇప్పటికే తేజా సజ్జాతో 'హనుమాన్'​ అనే ఓ సూపర్​హీరో సినిమాను తెరకెక్కించారు. త్వరలోనే అది విడుదల కానుంది. 'జాంబిరెడ్డి' వంటి సూపర్‌హిట్‌ తర్వాత తేజ- ప్రశాంత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కావటం వల్ల 'హనుమాన్‌'పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. తెలుగులో తెరకెక్కుతున్న తొలి ఒరిజినల్‌ సూపర్‌హీరో చిత్రమిది. అమృత అయ్యర్‌ కథానాయిక. దీన్ని కూడా నిరంజన్‌ రెడ్డి నిర్మించారు. ఈ పాన్‌ ఇండియా సినిమాకు అనుదీప్‌ దేవ్‌, హరిగౌర, జయకృష్ణ, కృష్ణ సౌరభ్‌ సంగీతం అందించారు. కాగా, ఇప్పటికే మలయాళంలో టోవీనో థామస్​ ప్రధాన పాత్రలో నటించిన 'మిన్నల్​మురళి' అనే సూపర్​హీరో చిత్రం విడుదలై పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంది. ​

ఇదీ చూడండి: ఆస్ట్రేలియాలో తారక్​ క్రేజ్​..​ 'జై ఎన్టీఆర్​​' ఆకృతిలో కార్ల ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.