ETV Bharat / sitara

దుబాయ్​లో 'ఆర్​ఆర్​ఆర్​' ప్రీ రిలీజ్​ ఈవెంట్​​.. చీఫ్​ గెస్ట్​గా టామ్​ క్రూజ్​! - ఆర్​ఆర్​ఆర్​ టామ్​ క్రూయిస్​

RRR pre release event in Dubai: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్అర్'​ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను భారీగా ప్లాన్​ చేస్తున్నారని తెలిసింది. దుబాయ్​లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారని తెలుస్తోంది. హాలీవుడ్​ యాక్షన్​ హీరో టామ్​ క్రూజ్​ ముఖ్య అతిథిగా రానున్నారట!

RRR pre release event in Dubai
ఆర్​ఆర్​ఆర్​ ప్రీ రిలీజ్ ఈవెట్​
author img

By

Published : Feb 24, 2022, 1:06 PM IST

RRR pre release event in Dubai: మెగాపవర్​ స్టార్​ రామ్​చరణ్​, యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ కలిసి నటించిన 'ఆర్​ఆర్​ఆర్' సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను దుబాయ్​లో గ్రాండ్​గా నిర్వహించడానికి ప్లాన్​ చేస్తున్నారని కొద్ది రోజులు క్రితం అంతా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడా కార్యక్రమం అక్కడే ఘనంగా జరపాలని, హాలీవుడ్​ యాక్షన్​ హీరో టామ్​ క్రూజ్​​ను ముఖ్య అతిథిగా పిలవాలని చిత్రబృందం భావిస్తోందట. మార్చి 1న ఈ వేడుక నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

కాగా, పరిస్థితి అంతా బాగుండి ఉంటే ఈ సినిమా మార్చి 7నే థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల అలా జరగలేదు. ఇప్పుడీ ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్​ చేయనున్నారు.

దాదాపు రూ.450కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. అజయ్​ దేవగణ్​, ఆలియా భట్​, శ్రియ కీలక పాత్రలో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఆ సీన్​ అత్యద్భుతం- తారక్, చరణ్​ ఇరగదీశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.