RRR movie team with Anil ravipudi: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. అయితే అందరూ అనుకునే విధంగా.. ఈ సినిమా దేశభక్తి కన్నా, స్నేహబంధాన్ని ఎక్కువగా చాటిచెప్పే మూవీ అని గతంలో జక్కన అన్నారు. కాగా, ఈ చిత్రం ప్రకటించకముందు కూడా తారక్, చెర్రీ కలిసి ఎప్పుడూ బయట కనిపించలేదు. ఈ సినిమాతోనే వీరి స్నేహం బలపడిందని అంతా అనుకున్నారు. తాజాగా ఈ విషయమై స్పందించారు ఈ స్టార్ హీరోలు. నిజజీవితంలో తామిద్దరి మధ్య ప్రపంచానికి తెలియనంత గొప్ప స్నేహం చాలా కాలం క్రితం నుంచి ఉందని తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌లో భాగంగా తమను ఇంటర్వ్యూ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం చెప్పారు.
NTR Ramcharan Friendship:
అనిల్ రావిపూడి: సినిమా ప్రమోషన్స్, ట్రైలర్స్ ఏమి చూసినా 'దోస్తీ' అనేదే బాగా కనపడుతోంది. దాన్ని ఆన్‌స్క్రీన్‌పై ఎలాగో చూస్తాం. మరి ఆఫ్‌స్క్రీన్ గురించి చెప్పగలరా?
తారక్: 'ఆర్ఆర్ఆర్' వల్ల మేం కలిశాం అనుకుంటున్నారు. కానీ జక్కనకే నిజం తెలుసు. ఎందుకు అంటే మా స్నేహాన్ని మేమెప్పుడు బహిర్గతం చేయలేదు. ప్రపంచానికి, సమాజానికి తెలియకుండా మేం మంచి స్నేహితులం. అది రాజమౌళికి ఒక్కడికే తెలుసు. మేము ఇద్దరం భిన్న ధ్రువాలం. భిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయనేది మా విషయంలో కూడా జరిగింది. అగ్నిపర్వతం బద్దలవుతున్నా చెర్రీ కామ్‌గా ఉండగలడు. అందుకే చరణ్ అంటే ఇష్టం ఏర్పడింది. అప్పట్లో స్టార్ క్రికెట్‌కు కలిసి వెళ్లేవాళ్లం, మాట్లాడుకునేవాళ్లం. అలా బాగా దగ్గరయ్యాం. బలమైన స్నేహం ఏర్పడింది. అది ఈ సినిమా ద్వారా బయటకు వచ్చింది. మార్చి 26న ప్రణతి పుట్టినరోజు. మార్చి 27న చెర్రీ పుట్టినరోజు. వీరిద్దరి ఇళ్లు చాలా దగ్గరగా ఉంటాయి. రాత్రి 12 గంటలకు ప్రణితిని కలిసి టక్కున రామ్ దగ్గరకి వెళ్లిపోయేవాడిని. అతడు నన్ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేవాడు.
అనిల్ రావిపూడి: సినిమాలో మీ ఇద్దరి మధ్య ఫైట్ ఉన్నట్లు టాక్. మరి రియల్ లైఫ్‌లో ఎప్పుడైనా కొట్టుకున్నారా?
రామ్‌చరణ్: రియల్ లైఫ్‌లో మా మధ్య ఫైట్లు ఏమీ ఉండవు. ఏదైనా ఒక టాపిక్‌మీద నాకంటూ ఓ అభిప్రాయం ఉంటుంది. తనకు ఒకలా ఉంటుుంది. అదెప్పుడూ ఫ్లేర్ అప్ అవ్వలేదు. అందుకే ఇందాక తను చెప్పినట్టు నాలో లేనిది తనలో చూసి ఎంజాయ్ చేస్తాను. ఇక ఒక్కోసారి షూటింగ్లో చాలా అలసిపోయేవాళ్లం. కానీ నేను ఏమి చెప్పను రాజమౌళి గారికి. అదే సమయంలో తారక్... 'జక్కన్న నన్ను వదిలేయ్ జక్కన్నా' అని అంటాడు. అది నిజానికి నా అభిప్రాయం. కాకపోతే అది అతడు చెప్తాడు. అదొక బ్యూటిఫుల్ బ్లెండ్(పరిణామం).
ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు!.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?