ETV Bharat / sitara

RRR: 300రోజులు.. 3వేలమంది.. రూ.500కోట్ల బడ్జెట్​! - ఆర్​ఆర్​ఆర్​ మూవీ స్టోరీ

RRR movie shooting journey: 'ఆర్​ఆర్​ఆర్'​ విడుదలకు నాలుగేళ్లుగా శ్రమపడ్డ రాజమౌళి బృందం... ఎన్నో వ్యయప్రయాసలకొర్చి అద్భుతంగా మలిచింది. వాస్తవానికి 240 రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేద్దామని భావించిన రాజమౌళికి కాల పరీక్ష ఎదురైంది. అనుకున్న సమయానికంటే 60 రోజులు ఎక్కువే తీసుకున్న జక్కన్న 300 రోజుల్లో 'ఆర్​ఆర్​ఆర్'​ను పూర్తి చేశారు. ఈ ప్రయాణం గురించి తెలుసుకుందాం..

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Mar 23, 2022, 5:59 PM IST

RRR movie shooting journey: మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్.. అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమాను కొత్తదారి పట్టించిన సృజనశీలి. సమయం తీసుకున్నా ప్రేక్షకుల సమయం వృథా కానివ్వని దార్శనికుడు. అందుకే రాజమౌళి సినిమా అంటే ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే నాలుగేళ్ల తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న మరో అద్భుతమైన చిత్రం ఆర్​ఆర్​ఆర్​. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్​గా సుమారు 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం మార్చ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇద్దరు స్వతంత్ర సమరయోధుల మధ్య స్నేహం ప్రధానంగా సాగే కథాంశంతో బాక్సాఫీసు వద్ద సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆర్​ఆర్​ఆర్​ చిత్రీకరణకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

  1. సినిమా బడ్జెట్‌: సుమారు రూ.500 కోట్లు.
  2. సాంకేతిక నిపుణుల సంఖ్య: 3000.
  3. ఈ చిత్రంలో భాగస్వాములైన కో డైరెక్టర్ల సంఖ్య: 9.
  4. చిత్రీకరణ సమయం: 300 రోజులకుపైగా.
  5. చిత్రీకరణకు ముందు రిహార్సల్ చేసిన సమయం: 200 రోజులు.
  6. షూటింగ్‌ పూర్తి చేసేందుకు ముందుగా అనుకున్న సమయం: 240 రోజులు. తర్వాత, మరో 60 రోజుల వ్యవధి పెంచారు.
  7. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయం: 75 రోజులు. లండన్‌కు చెందిన 2500, అబ్రాడ్‌కు చెందిన 40 మంది ఫైటర్లు
  8. నైట్‌ షూట్‌ (రాత్రివేళ చిత్రీకరణ): 25 నుంచి 28 రాత్రుళ్లు షూట్ చేయాలనుకున్నారు. కానీ, 60 రాత్రుళ్లు పట్టింది.
  9. చిత్రీకరణ జరిగిన ప్రాంతాలు: హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్‌, వికారాబాద్, గుజరాత్, బల్గేరియా, నెదర్లాండ్స్‌, ఉక్రెయిన్.
  10. రాజమౌళి తనయుడు కార్తికేయ స్నేహితుడికి చెందిన 10 ఎకరాల స్థలంలో (గండిపేట సమీపంలో) దిల్లీ సెట్ వేశారు.
  11. రామోజీ ఫిల్మ్ సిటీలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ పరిచయ సన్నివేశం, పతాక సన్నివేశం (క్లైమాక్స్‌) చిత్రీకరించారు. బల్గేరియాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ పరిచయ సన్నివేశం, పులితో పోరాడే సన్నివేశం తెరకెక్కించారు. ఉక్రెయిన్‌లోని ‘రియల్ ప్రెసిడెంట్ ప్యాలెస్’ లో ‘నాటు నాటు’ పాటను షూట్‌ చేశారు.
  12. ఈ పాట కోసం డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్ రక్షిత్‌తోపాటు ఓ స్టంట్ కొరియోగ్రాఫర్ పనిచేశారు. ఎమోషన్‌తో కూడిన మాస్‌ బీట్‌ ఇది.
  13. ఎన్టీఆర్ పులితో పోరాడే సన్నివేశానికి సంబంధించిన సీజీ (కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజనరీ) వర్క్‌ లండన్‌లోని ప్రఖ్యాత సంస్థ ఎంపీసీ (మూవింగ్‌ పిక్చర్‌ కంపెనీ)లో జరిగింది. ‘ది లయన్‌ కింగ్‌’ వంటి ఎన్నో హాలీవుడ్‌ చిత్రాల సీజీ పనులు అక్కడే పూర్తయ్యాయి.
  14. నటీనటుల పారితోషకాలు, మార్కెటింగ్‌, ప్రచార బాధ్యతలు రాజమౌళి తనయుడు కార్తికేయ; ఏ రోజు ఏ సీన్‌ షూట్‌ చేయాలి, నిర్మాణాంతర కార్యక్రమాలు సహా విడుదలకు సంబంధించిన వ్యవహారాలు రాజమౌళి వదిన, కీరవాణి సతీమణి శ్రీవల్లి చూసుకున్నారు.
  15. రాజమౌళి గతంలో తెరకెక్కించిన పలు సినిమాల చిత్రీకరణ సమయ వివరాలివీ.. ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి 600 రోజులు. ‘ఈగ’: 180 రోజులు, ‘మర్యాద రామన్న’: 120 రోజులు, ‘ఛత్రపతి’: 140 రోజులు.

ఇదీచూడండి: RRR movie: ఒక్క ఫొటో.. నాలుగేళ్ల ప్రయాణం.. సాగిందిలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.