ETV Bharat / sitara

కోల్​కతాలో 'ఆర్ఆర్ఆర్'.. రూ.400కోట్ల 'రాధేశ్యామ్'... 'అవతార్-2' ట్రైలర్​! - అవతార్​ 2 ట్రైలర్​

RRR Movie Pramotions: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'ఆర్​ఆర్​ఆర్'​, 'అవతార్​ 2', 'రాధేశ్యామ్'​, విజయ్​సేతుపతి-కత్రినా కైఫ్​ చిత్రాల సంగతులు ఉన్నాయి.

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Mar 22, 2022, 3:29 PM IST

Updated : Mar 22, 2022, 3:49 PM IST

RRR Movie Promotions: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో భాగంగా దేశ పర్యటన చేస్తున్న మూవీటీం తాజాగా కోల్​కతాలో సందడి చేసింది. హౌరా బ్రిడ్జ్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించింది. ఈ ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్​ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో 'ఆర్​ఆర్​ఆర్​'ను తీర్చిదిద్దారు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్‌లు ఈ వీకెండ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' రీసౌండ్‌తో దద్దరిల్లనున్నాయి.

'అవతార్ 2'..

Avatar 2 trailer: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించిన చిత్రం 'అవతార్‌'. ఈ చిత్రానికి మరో నాలుగు సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌. ఇందులో భాగంగా 'అవతార్‌ 2' చిత్రీకరణను పూర్తిచేసిన దర్శకుడు తాజాగా ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మే 6న రిలీజ్​ కానున్న 'డాక్టర్ స్ట్రేంజ్​ 2' సినిమాతో పాటు విడుదల అవ్వనున్నట్లు సోషల్​మీడియాలో ట్రెండింగ్​ అవుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

avatar 2
అవతార్​ 2

రాధేశ్యామ్​..

Radheyshyam collections: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్​'. రాధాకృష్ణ కుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్​స్టోరీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్​డ్​ టాక్​ను దక్కించుకున్నప్పటికీ బాక్సాఫీస్​​ వద్ద మంచి వసూళ్లనే అందుకుంది. విడుదలైన 10 రోజుల్లోనే రూ.400కోట్లకు పైగా కలెక్ట్​ చేసినట్లు తెలిసింది. కాగా, ఈ సినిమా ఏప్రిల్​ 2నుంచి అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ కానున్నట్లు సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విజయ్ సేతుపతి.. కత్రినా కైఫ్..

Vijaysethupati katrina kaif movie: విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మేరీ క్రిస్మస్'​. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ ప్రారంభించింది. హీరో విజయ్ ఈ విషయాన్ని తెలిపారు. దీంతోపాటే కత్రీనాతో కలిసి పనిచేయడంపై తన అనుభవాన్ని తెలిపారు. "కత్రీనాతో కలిసి పనిచేయం చాలా బాగుంది. ఆమె వృత్తిపట్ల అంకితభావంతో ఉంటారు. ఈ సినిమా షూటింగ్ పూర్తై ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను."అని విజయ్ అన్నారు.

Vijay Sethupathi
మేరీ క్రిస్మస్​

ఇదీ చదవండి: బీస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్​.. కేజీఎఫ్-2కు పోటీగా..

Last Updated : Mar 22, 2022, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.