RRR movie: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈసినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం గత కొన్ని రోజులుగా వరుస ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది.
మరోవైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో దాన్ని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా దిల్లీలో థియేటర్లు మూతపడ్డాయి. ముంబయిలోనూ సినిమాహాళ్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 'ఆర్‌ఆర్‌ఆర్' విడుదల వాయిదా పడే అవకాశం ఉందని నెట్టింట్లో ప్రచారం సాగుతోంది.
ఈనేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ బుధవారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'ఆర్‌ఆర్‌ఆర్' వాయిదా పడటం లేదని.. అనుకున్న తేదీకే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని రాజమౌళి తనతో చెప్పినట్లు తరణ్ తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
- 'రాజమౌళిని నమ్మి రూ.1000 కోట్లయినా పెట్టొచ్చు'
- 'ఆర్ఆర్ఆర్'లోని ప్రతి సీన్ మళ్లీ చేసేందుకు రెడీ: ఎన్టీఆర్
- రాజమౌళి డ్రీమ్‌ప్రాజెక్ట్ 'మహాభారతం'లో చరణ్-ఎన్టీఆర్
- RRR movie: రాజమౌళితోనే అది సాధ్యమైంది- హీరో రామ్‌చరణ్
- నా జీవితాన్ని ఇంతలా మార్చింది రాజమౌళినే: ఎన్టీఆర్
- RRR movie: రిలీజ్‌కు ముందే కలెక్షన్లలో 'ఆర్ఆర్ఆర్' రికార్డు
- 'ఆర్ఆర్ఆర్'లో అదిరిపోయే సీన్.. సీక్రెట్ రివీల్ చేసిన జక్కన్న
- RRR trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రికార్డుల మోత
- నాటు నాటు స్టెప్.. రాజమౌళి వల్ల ఎన్టీఆర్‌కు కష్టాలు!
- రాజమౌళి డైరెక్షన్‌ను డామినేట్ చేసిన ఓన్లీ హీరో అతడు!