ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ క్లైమాక్స్​ సర్​ప్రైజ్ ఇదే​.. ఫ్యాన్స్​కు జక్కన్న ట్రీట్​ - ఎత్తర జెండా

RRR Movie: 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్​ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా చివర్లలో వచ్చే ఓ పాటను ముందుగానే విడుదల చేసి అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకోనున్నట్లు చెప్పారు దర్శకధీరుడు రాజమౌళి.

RRR Celebration Anthem
RRR movie
author img

By

Published : Mar 10, 2022, 7:51 PM IST

RRR Movie: సినీ ప్రియులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ మరోసారి ప్రమోషన్స్‌ షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు సినిమాలో ప్రధానతారలైన రామ్‌చరణ్‌, తారక్‌, ఆలియాతో కూడిన కొత్త పోస్టర్‌ని షేర్‌ చేసింది.

RRR Celebration Anthem
'ఆర్​ఆర్​ఆర్'

"సినిమా చివర్లో 'ఎత్తర జెండా' అనే పాట నుంచి చూపించి మీ అందర్నీ సర్‌ప్రైజ్‌ చేయాలని మేము భావించాం. కాకపోతే, మా సంతోషాన్ని త్వరగా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాం. అందులో భాగంగానే 'ఆర్‌ఆర్‌ఆర్‌ సెలబ్రేషన్‌ ఆంథమ్‌'ని 14న విడుదల చేస్తున్నాం. ఈ పాటతో కౌంట్‌డౌన్‌ని ప్రారంభిద్దాం" అని రాజమౌళి పేర్కొన్నారు.

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాత.

ఇదీ చూడండి: 'అఖండ​' 100 డేస్ ఫంక్షన్​.. 'ఆర్​ఆర్​ఆర్​' ఐమ్యాక్స్ వెర్షన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.