'బాహుబలి' సిరీస్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ సినిమా 'ఆర్.ఆర్.ఆర్'పై విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నూతన సంవత్సరం కానుకగా చిత్రబృందం నుంచి ఏదైనా సర్ప్రైజ్ వచ్చే అవకాశముందని సమాచారం ఉండగా.. తాజాగా సినిమాలోని పాత్రల ఆధారంగా రూపొందిన ఓ పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంది. ఇది విపరీతంగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
-
Superb work! 🔥🌊 #RRRFanArt #RRRYehDosti #RRRMovie https://t.co/cYibYM32wW
— RRR Movie (@RRRMovie) December 28, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Superb work! 🔥🌊 #RRRFanArt #RRRYehDosti #RRRMovie https://t.co/cYibYM32wW
— RRR Movie (@RRRMovie) December 28, 2019Superb work! 🔥🌊 #RRRFanArt #RRRYehDosti #RRRMovie https://t.co/cYibYM32wW
— RRR Movie (@RRRMovie) December 28, 2019
జక్కన్నకు వీరాభిమాని అయిన ఓ కార్డూనిస్ట్ ఈ పోస్టర్‌ను రూపొందించాడు. సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీమ్ పాత్రలో తారక్ దర్శనమివ్వబోతున్నారు. ఇవే పాత్రలతో ఊహించిన రూపంలో పోస్టర్‌ను గీశాడు. ఇందులో ఇద్దరు హీరోలు స్వాతంత్ర్య పోరాటం కోసం చేతులు కలిపినట్లు కనిపించారు. దీనిపై చిత్రబృందం కూడా ప్రశంసలు వర్షం కురిపించింది. అంతేకాకుండా ఆ అభిమాని తయారు చేసిన చిత్రాన్ని... #యేదోస్తీ పేరుతో హ్యాపీ ఆర్ఆర్‌ఆర్ ఇయర్ అనే ట్యాగ్స్‌తో రీట్వీట్ చేసింది.
ఈ చిత్రంలో తొలిసారి రామ్‌చరణ్ - ఎన్టీఆర్ కలిసి తొలిసారి నటిస్తున్నారు. అధికారికంగా ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి చెర్రీ - తారక్‌ల పాత్రలపై ఒక్క పోస్టర్ కూడా బయటకు రాలేదు. కొత్త ఏడాది కానుకగా ఈ ఇద్దరి ఫస్ట్‌లుక్ సహా టైటిల్‌ను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రంలో హాలీవుడ్ నటులు ఓలీవియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, మైఖేల్ మ్యాడిసన్లతో పాటు అజయ్ దేవ్గన్, ఆలియా భట్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి:- పవన్ చారిత్రక సినిమా.. కీరవాణితో తొలిసారి