ETV Bharat / sitara

కుంభస్థలం బద్దలుకొట్టిన 'ఆర్ఆర్ఆర్'.. తొలి రోజు కలెక్షన్లలో ఆల్ టైం రికార్డు - ram charan

RRR Movie 1st Day Collection Worldwide: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్​' బ్లాక్​బస్టర్​ టాక్​తో దూసుకుపోతోంది. విడుదలకు ముందే కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు చేసిన ఈ చిత్రం.. తొలి రోజు వసూళ్లలోనూ ఆల్​టైం​ రికార్డులను సెట్​ చేస్తోంది. అమెరికాలో ప్రీమియర్స్​తో పాటు తొలి రోజు 5 మిలియన్ డాలర్ల మార్కును దాటగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.70 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

rrr movie 1st day collection worldwide
rrr movie
author img

By

Published : Mar 26, 2022, 9:27 AM IST

Updated : Mar 26, 2022, 12:15 PM IST

RRR Movie 1st Day Collection Worldwide: ఎన్టీఆర్​-రామ్​చరణ్​ కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్​లో 'బాహుబలి 2' రికార్డులను బ్రేక్​ చేసిన 'ఆర్​ఆర్​ఆర్'​.. తొలి రోజు వసూళ్లలోనూ అదే హవా కొనసాగిస్తోంది. కేవలం అమెరికాలోనే ప్రీమియర్స్​తో పాటు తొలి రోజు కలెక్షన్లు 5 మిలియన్ల (ఇంకా పెరిగే అవకాశం ఉంది) మార్కును దాటేశాయి. దీంతో 4.59 మిలియన్ డాలర్ల 'బాహుబలి 2' రికార్డును 'ఆర్​ఆర్​ఆర్'​ బ్రేక్ చేసేసింది.

rrr movie 1st day collection worldwide
'ఆర్​ఆర్​ఆర్​'

'బాహుబలి 2' రికార్డు బ్రేక్: దేశవ్యాప్తంగా తొలి రోజు రూ.166 కోట్ల పైచిలుకు వసూళ్లను సాధించింది 'ఆర్​ఆర్​ఆర్'​. ఇది కూడా బాహుబలి2 కలెక్షన్ల కంటే ఎక్కువే అని చెప్పుకోవాలి. తొలి రోజున బాహుబలి-2 రూ.152 కోట్లపైనే కలెక్షన్లను సాధించింది. అయితే ఇప్పుడు ఆ రికార్డును ఆర్​ఆర్​ఆర్​ తిరగరాసింది.

తొలిరోజే రూ.250 కోట్లు!: ఇక తొలి రోజు ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో కలిపి రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు ట్రేడ్​ వర్గాల సమాచారం. కర్ణాటకలో రూ.16.48 కోట్లు, తమిళనాడులో రూ.12.73కోట్లు, కేరళలో రూ.4.36 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక భారత్​లోని ఇతర ప్రాంతాల్లో దాదాపుగా రూ.25కోట్లు కొల్లగొట్టింది. ఓవర్సీస్​లో మరో రూ.78కోట్లు సాధించింది. దీంతో మొత్తంగా తొలి రోజే రూ.257 కోట్ల పైచిలుకు వసూళ్లను ఆర్​ఆర్​ఆర్​ రాబట్టిందని సమాచారం. ఈ మైలురాయిని అందుకున్న తొలి భారతీయ చిత్రంగా ఆర్​ఆర్​ఆర్​ నిలిచింది!

నైజాంలోనూ 'ఆర్​ఆర్​ఆర్'​ జోరు చూపిస్తోంది. తొలిరోజే రూ. 23.35 కోట్లు వసూలు చేసి ఏ సినిమాకూ అందనంత ఎత్తులో నిలిచింది. ఇప్పటివరకు ఇదే ఆల్​టైం రికార్డు. అయితే నైజాంలో గతంలో టాప్​లో నిలిచిన సినిమాలు ఏవి? అవి ఎంత వసూళ్లు సాధించాయో తెలుసుకుందాం.

  • 'ఆర్​ఆర్​ఆర్'- రూ. 23.35 కోట్లు
  • 'భీమ్లానాయక్'​- రూ.11.85 కోట్లు
  • 'పుష్ప'- రూ. 11.44 కోట్లు
  • 'రాధేశ్యామ్'- రూ. 10.80 కోట్లు
  • 'సాహో'- రూ. 9.41 కోట్లు
  • 'బాహుబలి 2'- రూ. 8.9 కోట్లు
  • 'వకీల్​సాబ్​'- రూ. 8.75 కోట్లు

ఇవీ చూడండి:

'ఆర్​ఆర్​ఆర్​'కు కొత్త తలనొప్పులు.. రంగంలోకి మూవీ టీమ్​

'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం తీవ్రంగా శ్రమించిన చరణ్​.. వీడియో వైరల్​!

''ఆర్‌ఆర్‌ఆర్‌' ఓ మాస్టర్‌ పీస్‌.. భారతదేశ అగ్నిపర్వతం'- సెలబ్రిటీల రివ్యూలు

Last Updated : Mar 26, 2022, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.