*'ఆర్ఆర్ఆర్' మేకింగ్ వీడియో, గురువారం ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' టైటిల్‌తో దీనిని అభిమానుల ముందుకు తీసుకురానున్నారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబరు 13న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

*స్టార్ డైరెక్టర్ శంకర్.. రామ్ కొత్త సినిమా షూటింగ్లో సందడి చేశారు. దర్శకుడు లింగుస్వామి, రామ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. ఆ ఫొటోలను #RAPO19 టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


*ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా 'హైవే' షూటింగ్ ప్రారంభమైంది. మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ హీరోయిన్గా నటిస్తోంది. '118' చిత్రంతో అలరించిన కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. సైమన్ కింగ్ సంగీతమందిస్తున్నారు.

*నితిన్ 'మాస్ట్రో' నుంచి 'బేబీ ఓ బేబీ' లిరికల్ సాంగ్, శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' స్నీక్ పీక్.. గురువారం గురువారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ రెండు చిత్రాల విడుదలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.


*యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా అతడు నటిస్తున్న 'ఎస్.ఆర్.కల్యాణ మండపం', 'సెబాస్టియన్' నుంచి అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో 'ఎస్.ఆర్.కల్యాణమండపం'.. ఆగస్టు 6న థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: