పైన టైటిల్ చూడగానే ఒక్కసారిగా షాకింగ్‌గా అనిపించిందా? కచ్చితంగా అనిపించే ఉంటుంది. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు అని అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా మరో డైరెక్టర్ ఎవరబ్బా అనే కదా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నా.
అసలు జరిగింది ఏంటంటే?
'ఆర్ఆర్ఆర్' అని గూగుల్ సెర్చ్ చేస్తే, అందుకు సంబంధించిన వికిపీడియా పేజ్ ఓ పక్కన కనిపిస్తుంది. అందులో అందరి పేర్లు సరిగ్గానే ఉన్నా, దర్శకుడు అని రాసున్న చోట రాజమౌళి పేరుతో పాటు సంజయ్ పాటిల్ అని ఉంది. ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.
రామ్‌చరణ్, జూ. ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. సముద్రఖని, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. సుమారు రూ.350 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.