ETV Bharat / sitara

తొలి భారతీయ చిత్రంగా 'ఆర్​ఆర్​ఆర్' మరో రికార్డ్.. కెనడాలో ఫ్యాన్స్ హంగామా​ - ఆర్​ఆర్​ఆర్​ సినిమా కెనడా ఫ్యాన్స్​ ర్యాలీ

RRR canada fans special video with cars: మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్​ఆర్​ఆర్' చిత్రబృందానికి వినూత్న రూపంలో విషెస్​ తెలిపారు కెనడాలోని ఎన్టీఆర్​ ఫ్యాన్స్​. కార్లతో ర్యాలీగా వెళ్లి.. 'ఆర్​ఆర్​ఆర్'​ ఆకృతిలో వాటిని అమర్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్​మీడియాలో పోస్ట్​ చేసిన మూవీ టీం సదరు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ​

RRR canada fans made special video with cars

author img

By

Published : Mar 12, 2022, 2:35 PM IST

RRR canada fans special video with cars: 'ఆర్​ఆర్​ఆర్'​.. ప్రపంచవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఈ పేరే వినిపిస్తోంది. దీని హంగామానే కనిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడేకొద్ది.. సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు ప్రతిఒక్కరిలోనూ ఉత్కంఠ, ఆసక్తి పెరిగిపోతుంది. చిత్రం విజయవంతం అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

అయితే కొంతమంది ఫ్యాన్స్​ వినూత్న రూపంలో సినిమాకు సంబంధించిన వీడియోలను తమదైన స్టైల్​లో అనుకరిస్తున్నారు. డిఫరెంట్​ స్టైల్​లో విషెస్​ తెలుపుతున్నారు.

తాజాగా కెనడాలోని ఎన్టీఆర్​ ఫ్యాన్స్​, ప్రవాసభారతీయులు అక్కడివారితో కలిసి ఓ స్పెషల్​ వీడియోను రూపొందించి సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. కార్లతో ర్యాలీగా వెళ్లి.. 'ఆర్​ఆర్​ఆర్' ఆకృతిలో వాటిని అమర్చారు. దానికి సినిమా బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​కు జోడించి.. 'తొక్కుకుంటూపోవాలే' అని క్యాప్షన్​ జోడించారు. చిత్రం విజయవంతం కావాలని ఎన్టీఆర్​, రామ్​చరణ్, రాజమౌళి సహా చిత్రబృందానికి ప్రత్యేకంగా​ ఆల్​ ది బెస్ట్​ చెప్పారు. ఈ వీడియోను మెచ్చిన 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రబృందం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ వీడియోను సోషల్​మీడియాలో ట్వీట్​ చేసింది. ప్రస్తుతం ఇది నెటిజన్లను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారీగా లైక్స్​, కామెంట్స్​ వస్తున్నాయి.

డాల్బీలో తొలి సారిగా

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల స్క్రీన్లపై ప్రదర్శనకానున్న ఈ చిత్రం.. డాల్బీ విజన్​ స్క్రీన్​పైనా కూడా ప్రదర్శన కానుంది. ఈ స్క్రీన్​పై భారతీయ చిత్రం ప్రదర్శించడం కావడం ఇదే తొలిసారి.

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాత.

ఇదీ చూడండి: Akhanda 100 days: 'NBK 107' సెట్​లో 'అఖండ' టీమ్​ సెలబ్రేషన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.