కొత్త ఏడాదిలో వరుసగా సర్‌ప్రైజ్‌లు ఇస్తామంటూ 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఇప్పటికే ప్రకటించింది. అందుకు తగినట్లుగానే సందర్భాన్ని బట్టి సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు ఇస్తోంది. ఇక 'ఆర్‌ఆర్‌ఆర్: డైరీస్' పేరుతో షూటింగ్‌కు సంబంధించిన చిన్న చిన్న వీడియోలను పంచుకుంటోంది. త్వరలోనే అలియా భట్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
-
Meet our #Sita in all her glory. ✨
— DVV Entertainment (@DVVMovies) March 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
First look of @Aliaa08 from @RRRMovie will be revealed on March 15, 11 AM. #RRRMovie #RRR@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @oliviamorris891 @DVVMovies pic.twitter.com/12SKfHeXNc
">Meet our #Sita in all her glory. ✨
— DVV Entertainment (@DVVMovies) March 13, 2021
First look of @Aliaa08 from @RRRMovie will be revealed on March 15, 11 AM. #RRRMovie #RRR@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @oliviamorris891 @DVVMovies pic.twitter.com/12SKfHeXNcMeet our #Sita in all her glory. ✨
— DVV Entertainment (@DVVMovies) March 13, 2021
First look of @Aliaa08 from @RRRMovie will be revealed on March 15, 11 AM. #RRRMovie #RRR@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @oliviamorris891 @DVVMovies pic.twitter.com/12SKfHeXNc
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రమిది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్‌కు జోడీగా సీత పాత్రలో అలియా కనిపించనుంది. మార్చి 15న అలియా పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 11గంటలకు ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే ఒక షెడ్యూల్‌లో అలియా పాల్గొంది. మరోవైపు ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ దాదాపు పూర్తికావొచ్చింది. త్వరలో తీయబోయే మరో షెడ్యూల్‌లో అలియా కూడా వచ్చి చేరుతుందని సమాచారం. ఇప్పటికే కీలక నటీనటుల ఫస్ట్‌లుక్‌లు, టీజర్‌లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ నిర్మిస్తున్నారు.