ETV Bharat / sitara

మరికాసేపట్లో 'ఆర్‌ఆర్‌ఆర్'లో‌ ఆలియా ఫస్ట్​లుక్​ - RRR movie

దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్'​లో హీరోయిన్​ ఆలియా భట్​ ఫస్ట్​లుక్​ను సోమవారం 11గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రం అక్టోబర్​ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

alia
ఆలియా
author img

By

Published : Mar 15, 2021, 9:54 AM IST

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'ఆర్​ఆర్ఆర్'​ నుంచి కొత్త అప్డేట్​ మరి కాసేపట్లో రానుంది. ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న బాలీవుడ్​ హీరోయిన్​ ఆలియా భట్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్​లుక్​ను 11గంటలకు విడుదల చేయనుంది చిత్రబృందం.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రమిది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్‌కు జోడీగా సీత పాత్రలో అలియా కనిపించనుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్‌లో అలియా పాల్గొంది. మరోవైపు ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ దాదాపు పూర్తికావొచ్చింది. ఇప్పటికే కీలక నటీనటుల ఫస్ట్‌లుక్‌లు, టీజర్‌లు విడుదలై సినీప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చూడండి: ఆలియాకు నెగిటివ్​.. ఊపిరి పీల్చుకున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.