ETV Bharat / sitara

'అన్నయ్యా.. ఇన్నిరోజుల విశ్రాంతి నీ హక్కు కాదు' - ఆర్పీ పట్నాయక్​

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాను జయించి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుతూ సినీ మ్యుజిషియన్స్‌ యూనియన్‌ మంగళవారం ప్రార్థనలు నిర్వహించింది. సంగీత సామ్రాజ్యానికి చెందిన ఎందరో ప్రముఖులు ఎవరి ఇళ్లలో వాళ్లే ఉంటూ ప్రార్థనలు చేశారు. వాటికి సంబంధించిన చిత్రాలను, వీడియోలను సోషల్​మీడియాలో పంచుకున్నారు.

RP Patnaik gives a call for a universal mass prayer for SPB's health
'అన్నయ్య..! ఇన్నిరోజులు విశ్రాంతి తీసుకునే హక్కు నీకు లేదు'
author img

By

Published : Aug 19, 2020, 7:33 AM IST

'పాట నన్ను వదలదు.. నేను పాటను వదలను'.. - అని మాటిచ్చావ్‌ బాలు..!

ఇచ్చిన మాట నువ్వు ఎప్పుడూ తప్పవు.

వైరస్‌పై నువ్వు గెలవాలని.. నీ గాత్రంలో ప్రాణం పోసుకున్న వేల పల్లవులు ఆలయాల్లో మొక్కుతున్నాయి.

నువ్వు తీసిన రాగాలన్నీ ఒక్కటై త్వరగా కోలుకోవాలని నినదిస్తున్నాయి. పలికిన చరణాలన్నీ దేవుళ్ల చరణాగతమై వేడుకుంటున్నాయి..

నువ్వు ఆరోగ్యంగా తిరిగి రావాలని....!

మా కోసం తిరిగొస్తావు. 'పాడుతా తీయగా' అంటూ మాముందుకొస్తావు.

నీ గానామృతంతో ఎన్నో పాటలకు జీవం పోశావు కదా!

అవన్నీ కోట్ల గుండెల్లో కొలువై నీ కోసం కొట్టుకుంటున్నాయి.

ఆ గుండెల చప్పుడు చాలదూ...

ఆ మహమ్మారిని భయపెట్టడానికి..

నీ పాటాభిషేకంతో పులకించిపోయిన అభిమానుల మనసులన్నీ నీ వెంట ఉన్నాయి.

ఆ మనో బలం చాలదూ... కరోనాని మట్టి కరిపించడానికి మమ్మల్ని ఆనందపరవశుల్ని చేయడానికి...

నువ్వు రాత్రింబవళ్లు పాడావు... ఆ కష్టం ముందు ఈ వైరస్‌ ఎంత?

నువ్వు జయిస్తావు... మళ్లీ మా కోసం పాడతావు.

"ఒక్క ప్రాణం కాస్త నలతగా ఉండి ఆయాస పడుతూ ఉంటే.. ఒకటి కాదు, వేలు, లక్షలు కాదు... కోట్లాది ప్రాణాలు కలత పడి కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక్క ప్రాణం శ్వాసలో సరిగమల అపశ్రుతులు సరి చేసుకుంటుంటే.. నా దేశపు ఊపిరి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొన్ని తరాలుగా గాలి బాలు పాటగా, మాటగా ఉనికిని చాటుకుంటూ వీస్తోంది.. విహరిస్తోంది. ఇప్పుడెందుకో ఓ చిన్న వెంటిలేటర్‌ ఇరుకులో చిక్కుకుని విలవిలాడుతోంది. కొన్నాళ్లుగా ఆకాశపు మౌనం కంటికి, మింటికి ఏకధారగా రోధించి, నిన్నటి నుంచే వెచ్చని సూర్య కిరణాలతో చెక్కిళ్లు తుడుచుకొని కాస్త తెరిపిన పడుతోంది. అన్నయ్య ఇక చాలు. ఇన్ని రోజులు నిశ్శబ్ధంగా విశ్రాంతి తీసుకునే హక్కు, అక్కర నీకు లేవు. తొందరగా కోలుకో. కొత్త పల్లవితో ప్రకృతికి ప్రాణగీతికగా చిగురించు.. మా అందరి గొంతులో కొట్టుకుంటున్న గుండెల సడిని సరిచేయి. చినుకు సీమలో మసకబారిపోయిన దిశలకు నీ నవ్వు వెలుగుతో దారి చూపాలి".

- సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీత ప్రార్థనలు

కరోనాతో పోరాటం చేస్తున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతూ మంగళవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సినీ మ్యుజిషియన్స్‌ యూనియన్‌ తరఫున సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌, గాయని విజయలక్ష్మి ఇచ్చిన పిలుపు మేరకు ఉన్న చోటనే ఎవరికివారు ఇష్టదైవాన్ని తలచుకుంటూ ప్రార్థనలు చేశారు. పలువురు ప్రముఖులు ప్రార్థనలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.