సంగీత ప్రియుల్ని హుషారెత్తించిన 'రౌడీ బేబీ' పాట యూట్యూబ్లో మరో రికార్డు సృష్టించింది. 'మారి 2' సినిమాలో ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సాంగ్... ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది. తాజాగా 700 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని.. ఈ ఘనతను వేగంగా అందుకున్న తొలి భారతీయ పాటగా ఘనతకెక్కింది. 318 రోజుల 13 గంటల్లో ఈ మైలురాయి చేరుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇంతకంటే ముందు స్వాగ్ సే స్వాగత్ పాట 446 రోజుల్లో, లాహోర్ పాట 481 రోజుల్లో 700 మిలియన్ల మైలురాయిని చేరుకున్నాయి.
యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చిన 'రౌడీబేబీ' పాటకు ధనుష్ సాహిత్యం అందించాడు. అంతేకాకుండా ధనుష్, ధీ పాటను ఆలపించారు. ప్రభుదేవా, జానీ, బాబా భాస్కర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రాన్ని వండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ నిర్మించాడు. దర్శకుడు బాలాజీ మోహన్ తెరకెక్కించిన ఈ చిత్రం... 2018 డిసెంబరు 21 విడుదలై మంచి విజయం అందుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి:యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖతాలో '100 మిలియన్స్'