ETV Bharat / sitara

విశాఖలో 'రౌడీ బేబీ' షూటింగ్ ప్రారంభం - rowdy baby shooting

ఏపీలోని విశాఖలో రౌడీ బేబీ చిత్రీకరణ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. విశాలాక్షినగర్ రెవెన్యూ పార్కు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

rowdy-baby-shooting-begins-at-visakha
విశాఖలో 'రౌడీ బేబీ' షూటింగ్ ప్రారంభం
author img

By

Published : Dec 16, 2020, 9:54 PM IST

ఏపీలోని విశాఖలో సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. విశాలాక్షినగర్​లోని రెవెన్యూ పార్కు వద్ద 'రౌడీ బేబీ' చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖలోనే పూర్తిగా చిత్ర నిర్మాణం జరగనున్న సినిమాగా రౌడీ బేబీ నిలుస్తుందని నిర్మాత కోనా వెంకట్ వెల్లడించారు. కోనా ఫిలిం కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్​కు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ క్లాప్ నివ్వగా, జీవీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్థానిక శాసన సభ్యులు చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు.

సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, కరణం ధర్మశ్రీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సైతం చిత్రంలో నటించనున్నారు.

ఇదీ చూడండి: 'నిశ్చయ్​' పెళ్లికి అందుకే రాలేదు: రేణు దేశాయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.