నాని-శర్వానంద్‌లతో 'బెంగళూరు డేస్' రీమేక్ తీసే ప్రయత్నం చేశాడట నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం ఆయన నిర్మాణ సంస్థ నుంచి వస్తోన్న కొత్త చిత్రం 'జాను'. ఈ సినిమా గురించి ప్రస్తావించిన దిల్‌రాజు తాజాగా ఆయన తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నాడు.
"నేను రీమేక్‌లు చేయకూడదని ఎప్పుడూ అనుకోలేదు. మొదటి నుంచి వాటి జోలికి వెళ్లలేదంతే. అప్పట్లో 'బెంగళూరు డేస్', 'ప్రేమమ్' చిత్రాలు బాగా నచ్చాయి. వాటిని నేను రీమేక్ చెయ్యాలనుకున్నా. ఆ స్క్రిప్ట్‌లపై వర్క్ చేశాం కూడా. 'బెంగళూరు డేస్' కోసం నాని, శర్వానంద్‌లను తీసుకుందాం అనుకున్నా. కానీ, మూడో కథానాయకుడి పాత్రకు ఎవరూ సెట్ కాలేదు. అందుకే ఆ ప్రాజెక్టును అలాగే పక్కకు ఉంచాం. ఆ సమయంలోనే 'ప్రేమమ్' తియ్యాలనుకున్నా. అప్పుడే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్లు ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నామని చెప్పడం వల్ల సరే అన్నా. ఈ ఏడాదిలో మొత్తం మూడు రీమేక్‌లు చేస్తున్నా. ఒకటి 'పింక్' తెలుగు రీమేక్, 'జెర్సీ' హిందీ రీమేక్, మూడోది ఇప్పుడు రాబోతున్న '96' రీమేక్ 'జాను'.
- దిల్‌రాజు, నిర్మాత
దిల్‌రాజు నిర్మాణ సంస్థలో తెరకెక్కిన 'జాను' ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్, సమంత జంటగా నటించిన ఈ చిత్రం తమిళ హిట్ సినిమా '96'కు రీమేక్‌గా తెరకెక్కించారు. సి.ప్రేమ్‌కుమార్ దర్శకుడు.
ఇదీ చదవండి: 'మైదాన్' సినిమా విడుదల తేదీలో మార్పు