'ఇస్మార్ట్ శంకర్' దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి కొత్తగా నటిస్తున్న చిత్రం 'రొమాంటిక్'. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని "నువ్వునేను ఈ క్షణం" అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సాంగ్కు పూరి జగన్నాథ్ సాహిత్యం అందించడం విశేషం. పాటలాగా కాకుండా కవితలాగా ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తోంది. పూరి తెరకెక్కించే చిత్రాల్లోనూ, తనయుడు ఆకాష్ నటించే చిత్రంలోనూ ఎక్కువగా యువతే ప్రధాన పాత్రలుగా వస్తుంటాయి. ఈ సినిమాకు పూరితో పాటు ఛార్మి కూడా నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.
ఇవీ చూడండి.. అలా పోలీస్ పాత్ర ఓకే అయింది: బాలకృష్ణ