ETV Bharat / sitara

ఈనెల 15న 'నాగలి' పాట విడుదల: రోల్​రైడా - రోల్​రైడా నాగలి రిలీజ్​ తేదీ తాజా వార్త

అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు కోపం వస్తే ఎలా ఉంటుంది మనం ఊపించగలమా..! అలాంటి వారి ఆవేదన, ఆక్రందనను కళ్లకు కట్టినట్టు పాట రూపంలో చిత్రీకరించినట్టు ప్రముఖ ర్యాపర్​ రోల్​రైడా తెలిపాడు. దానిని 'నాగలి' అనే టైటిల్​తో ఈనెల 15న ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నట్టు ఆయన వెల్లడించారు.

Roll rida Nagali song release date announced in hyderabad
ఈనెల 15న 'నాగలి' పాట విడుదల: రోల్​రైడా
author img

By

Published : Aug 2, 2020, 9:53 PM IST

అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరుపు రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి అవగాహన కల్పించిన ప్రముఖ ర్యాపర్ రోల్ రైడా... మరోసారి తన ప్రత్యేకతను చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఇన్నాళ్లు రైతుల కష్టాలు, కన్నీళ్లను చూసి చలించిన అతను.. రైతుకు కోపం వస్తే ఎలా ఉండబోతుందో 'నాగలి' అనే ప్రత్యేక గీతంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

అమిత్, రోల్ రైడా ప్రధాన పాత్రల్లో నటించిన ఆ పాట ప్రచార చిత్రాన్ని తాజాగా విడుదల చేశారు. నాలుగు నిమిషాల నిడివితో ఉండే ఆ పాటను ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీత సారథ్యంలో అరుపు పాటకు దర్శకత్వం వహించిన హరికాంత్ ఈ పాటను రూపొందించారు. కళా మోషన్ పిక్చర్స్ నిర్మించిన 'నాగలి'ని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు రోల్ రైడా తెలిపారు.

ఇదీ చూడండి : భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.