ETV Bharat / sitara

విడుదలకు సిద్ధమైన నారాయణమూర్తి 'రైతన్న'

స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న 'రైతన్న' చిత్రాన్ని ఫిబ్రవరి ఆఖర్లో లేదా మార్చి ప్రారంభంలో విడుదల చేస్తామని ఆర్‌.నారాయణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కార్పొరేట్ బడ్జెట్‌ను తలపించేలా ఉందని విమర్శించారు.

raitanna
రైతన్న
author img

By

Published : Feb 3, 2021, 10:27 PM IST

పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం 'రైతన్న'. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఫిబ్రవరి ఆఖర్లో లేదా మార్చి ప్రారంభంలో సినిమాను విడుదల చేస్తామని ఆయన బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కార్పొరేట్ బడ్జెట్‌ను తలపించేలా ఉందని విమర్శించారు.

పంటలకు గిట్టుబాటు ధర కల్పించే అంశాన్ని ప్రస్తావించకపోవడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. స్వామినాథన్ ప్రతిపాదనల మేరకు బడ్జెట్ కేటాయిస్తే రైతులకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం రాదన్నారు. తెలుగు రాష్ట్రాలను విస్మరించి ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.