వ్యవసాయ రంగంలో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఎం.ఎస్.స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరిస్తూ 'రైతు బంద్' సినిమా తీసిననట్లు ప్రకటించారు. దేశానికి అన్నంపెట్టే రైతన్న నిరసన ఎలా ఉంటుందో తన చిత్రంలో చూపిస్తానని నారాయణమూర్తి తెలిపారు.
ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 'రైతుబంద్'ను ఫిబ్రవరిలో విడుదల చేస్తామని నారాయణమూర్తి వెల్లడించారు.
"వ్యవసాయ రంగంలో రాష్ట్రాలను విస్మరించవచ్చదని సుప్రీంకోర్టుల మూడుసార్లు చెప్పింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలి. డాక్టర్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేసి రైతులకు మేలు చేయాలి" అని నారాయణమూర్తి చెప్పారు.
ఇది చదవండి: 'పెళ్లి' గురించి ఆర్.నారాయణమూర్తి మాటల్లో!