నేచురల్ స్టార్ నాని మరోసారి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించబోతున్నాడు. రీతూ వర్మ కథానాయిక. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా వచ్చింది. అయితే అందులో పూర్తి స్థాయి నాయికగా నటించలేదు. ఇప్పుడు ఆ అవకాశం దక్కింది. డిసెంబర్ నుంచి చిత్రీకరణ మొదలుపెడతారు.
షైన్ స్కీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'నిన్ను కోరి', 'మజిలి' వంటి విజయవంతమైన సినిమాల తర్వాత శివ నిర్వాణ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
ఈ దర్శకుడు ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు మంచి ప్రేమ కథా చిత్రాలుగా మిగిలిపోయాయి. మరి నానితో రెండోసారి చేయబోయే చిత్రం కూడా ప్రేమకథా చిత్రంగానే ఉండబోతోందని సమాచారం. ఇందుకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను కొద్ది రోజుల తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.
ఇవీ చూడండి.. 'బిగ్ బాస్' కోసం సల్మాన్ పారితోషికం ఎంతో తెలుసా..?