ETV Bharat / sitara

దానికి ఇంకా టైమ్ ఉంది: హీరోయిన్ రీతూవర్మ - వరుడు కావలెను రివ్యూ

మరో రెండు మూడేళ్లు పెళ్లి గురించి ఆలోచనే లేదని హీరోయిన్ రీతూవర్మ(ritu varma new movie) చెప్పింది. 'వరుడు కావలెను' విడుదల(varudu kaavalenu release date) సందర్భంగా చిత్రవిశేషాలను వెల్లడించింది.

ritu varma
రీతూవర్మ
author img

By

Published : Oct 27, 2021, 6:36 AM IST

"నేటితరం అమ్మాయిల్ని పోలిన పాత్రల్లోనే నటిస్తుంటా. అందుకే ప్రతి పాత్రలోనూ నన్ను నేను చూసుకొనే అవకాశం లభిస్తోంది" అని హీరోయిన్ రీతూవర్మ(ritu varma movies) అంటోంది. కొన్నాళ్లుగా తెలుగు తెరపై విజయవంతంగా మెరుస్తున్న అచ్చ తెలుగందం ఈమె. వరుస సినిమాలతో దూసుకెళుతోంది. ఇటీవల నాగశౌర్యతో కలిసి 'వరుడు కావలెను'లో(varudu kaavalenu release date) నటించింది. ఆ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

* మొన్న 'టక్‌ జగదీష్‌'(tuck jagadish movie), ఇప్పుడు 'వరుడు కావలెను'... మీ సినిమాలు వెంట వెంటనే విడుదల అవుతున్నాయి. దీన్ని ఫీలవుతున్నారు?

ఈ ఏడాదిలో విడుదలవుతున్న నా మూడో చిత్రమిది. మొదట 'నిన్నిలా నిన్నిలా' విడుదలైంది, ఆ తర్వాత ‘టక్‌ జగదీష్‌’. ఆ రెండూ ఓటీటీలోనే విడుదలయ్యాయి. థియేటర్‌లో సినిమాని చాలా మిస్‌ అయ్యాను. ఆ లోటుని తీర్చేలా ‘వరుడు కావలెను’ థియేటర్లలో విడుదలవుతుండడం సంతోషంగా ఉంది.

ritu varma
రీతూవర్మ

* ఇందులో నటించడానికి ప్రేరేపించిన విషయాలేవి?

బలమైన కథానాయిక పాత్రల్ని చేయడమే నా బలం అని నమ్ముతాను. నాపై ఎంత ఒత్తిడి ఉంటే అంత మంచి పనితీరు నా నుంచి వస్తుంది. సవాళ్లను స్వీకరించడానికి ఇష్టపడతాను. ఈ కథ, పాత్రలు వినగానే చాలా నచ్చాయి. నేను పోషించిన భూమి పాత్రలో చాలా కోణాలు ఉంటాయి. దర్శకురాలు లక్ష్మీసౌజన్య అలా తీర్చిదిద్దారు. ఈ సినిమా తర్వాత నేనొక పరిపూర్ణమైన నటిగా గుర్తుండిపోతాను.

* ప్రతిసారీ బలమైన పాత్రలు దొరకడం కష్టం కదా?

అలాంటి కథలు, పాత్రల్ని దర్శకులు సృష్టిస్తూనే ఉంటారు. వాటికి నన్ను ఎంచుకోవడమే నా అదృష్టం. అయితే 'వరుడు కావలెను' మహిళా ప్రధానంగా సాగే సినిమా ఏమీ కాదు. హీరోయిన్‌ పాత్ర బలంగా ఉన్నంత మాత్రాన అది మహిళా ప్రధానమైన సినిమా కాదు. ఇదొక ప్రేమకథ. ఇటు కుటుంబ ప్రేక్షకులకూ, అటు యువతరానికీ నచ్చేలా ఉంటుంది. నాగశౌర్య(naga shourya new movie) క్రమశిక్షణ కలిగిన నటుడు. మా జోడీ బాగుందనే కితాబు చిత్రీకరణ దశలోనే వచ్చింది. అక్కడే సగం విజయం సాధించాం అనిపించింది.

ritu varma  varudu kavalenu movie
నాగశౌర్య-రీతూవర్మ

'వరుడు కావలెను'(varudu kaavalenu review) అని సినిమా వరకే అంటున్నాను కానీ, నిజ జీవితంలో దానికి ఇంకా సమయం ఉంది. రెండు మూడేళ్ల వరకు పెళ్లి గురించి ఆలోచనే లేదు. మా ఇంట్లో పెళ్లి విషయంలో బలవంతం ఏమీ చేయడం లేదు. నీకు నచ్చినప్పుడే చేస్కో అంటారు. కలల పాత్రలంటే.. సినిమాలకు దూరమయ్యేలోపు ఒక్క చారిత్రాత్మక సినిమానైనా చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో శర్వానంద్‌తో(sharwanand new movie) కలిసి ఓ సినిమాలో నటిస్తున్నా. తమిళంలో మరో చిత్రం చేస్తున్నా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.